Breaking News

కళింగ వైశ్యులను బిసి-డి గా గుర్తించాలి… : వి.ఆర్.కళ్యాణ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కలింగవైశ్యులను “బిసి-డి”గా గుర్తించాలని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ (వైశ్య ) వ్యవస్థాపక అధ్యక్షులు వి. ఆర్. కళ్యాణ్ అన్నారు .స్థానిక గాంధీనగర్ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… 12 ఏళ్ల మా జాతి పెద్దల పోరాటానికి 2014 వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులకే మా కళింగ (కోమటి) వైశ్య కులాన్ని జీవో ఎంఎస్ 10 బీసీ డబ్ల్యూ సి డిపార్ట్మెంట్ 2014లో మమల్ని బిసి-డి గా గుర్తించి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారని అన్నారు .అయితే సదరు ఉత్తర్వులు అప్పటి ఉమ్మడి జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం \, విశాఖపట్నం జిల్లాలకు మాత్రమే బిసి-డి వర్తించాయని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో మరియు చుట్టుపక్కల జిల్లాలలో అనేక కారణాలుగా 25 వేల కుటుంబాలు నివసిస్తున్నారని, ఇలా గుర్తింపు లేకుండా జీవిస్తున్న మా వారి కోసం 2017 సం.వ నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి, తదుపరి ప్రభుత్వానికి విన్నవించగా 2023 సంవత్సరం జీవో ఎంఎస్ నెంబర్ 25 బిసి డబ్ల్యూ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళింగ వైశ్య జాతిని బిసి గా ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారని, కానీ మాకు ఇచ్చిన ఆ జీవో ఇంప్లిమెంటేషన్ చేయలేదని అన్నారు. అందువల్ల గతంలో లాగానే ఉత్తరాంధ్ర మినహాయించి, ఇతర 20 జిల్లాలలో బి.సి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఆవేదన వ్యక్తం చేశారు. మేము పుట్టిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామో అక్కడే మాకు ఉన్న బిసి-డి సర్టిఫికెట్లను సాధారణ రుసుము తీసుకొని ఎటువంటి ఆటంకాలు లేకుండా ,మైగ్రేషన్ లేకుండా ఇప్పించమని కోరుకుంటున్నామని అన్నారు. అంతే కాకుండా ఈ జీ.వో నెంబర్ 25లో మాతో పాటు ఇంకా 1-20 సీరియల్ నెంబర్లలో నాలుగు కేటగిరీలుగా అనేక కులాలు ఉన్నాయని, వీరికి కూడా మా లాగె రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో తమ బిసి కుల ధ్రువీకరణ పత్రాలు రావడంలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించేలా ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతానికి కూడా మా బిసి కార్పొరేషన్ స్థానం కల్పించమని కోరారు.
ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్లి పలుసార్లు మా వినతిపత్రం అందచేశామని, ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా కాకుండా మా జాతికి సంబంధించిన కార్పొరేషన్ లో స్థానాలన్నింటినీ ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించేలాగా ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతానికి కూడా మా బీసీ కార్పొరేషన్ స్థానం కల్పించమని ఉప ముఖ్యమంత్రిని వినయ పూర్వకంగా వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళింగవైశ్య కులస్తులు పాల్గొని మద్దతు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *