Breaking News

ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి న్యాయమైన వాటాను ఇవ్వాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర విజయవాడ ఎస్సీ వర్గీకరణలో రెల్లి సామాజిక వర్గానికి రావలసిన న్యాయమైన వాటాను ఇవ్వాలని వాటా నిష్పత్తిని పెంచాలని రెల్లి మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెల్లి కార్పొరేషన్ ను త్వరితగతిన పునరుద్ధరించి రెల్లి సామాజిక వర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మీసాల ఏడుకొండలు పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ జాతికి సంబంధించినటువంటి 59 ఉపకులాలలో మూడవ అతి పెద్ద ఉపకులానికి చెందిన రెల్లి వాటి అనుబంధ కులాలు దశాబ్దాలుగా సామాజిక ఆర్థిక రాజకీయ అణచివేతకు గురవుతున్నారన్నారు ప్రభుత్వం రాజకీయ పార్టీలు రెల్లి సామాజిక వర్గం విషయంలో ఎప్పటికప్పుడు మొండి చేయి చూపిస్తూనే ఉన్నాయన్నారు జనాభాను తక్కువగా చూపడం వల్ల వర్గీకరణ లో అన్యాయంగా రోస్టర్ విధానంలో ఒక్క శాతం మాత్రమే రిజర్వేషన్ కల్పించడం వల్ల తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు.
ఈ విధానం వల్ల తమ జీవితాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు అత్యవసరంగా కుల గణన జనగణన చేపట్టి వర్గీకరణ అమలుపరచాలన్నారు గతంలో ఉన్నటువంటి రెల్లి కార్పొరేషన్ను తిరిగి పునరుద్ధరించి మా ఫలాలను మేము పంచుకునే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో రెల్లి సంఘం నాయకులు సోమీ కమల్ పాలెపు శివకుమార్ ధనాల శ్రీనివాసరావు ముత్యాల మారుతి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *