Breaking News

కె.బి.ఎన్. కాలేజీకి స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ తీసుకువ‌చ్చేందుకు కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్

-కె.బి.ఎన్. కాలేజీ స్పోర్ట్స్ డే సెలబ్రేష‌న్స్ కి ముఖ్యఅతిథిగా హాజ‌రు
-పోటీ ప‌రీక్ష‌ల్లో , క్రీడ‌ల్లో ప‌త‌కాలు సాధించిన విధ్యార్ధుల‌కు స‌న్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప‌శ్చిమ‌నియోక‌వ‌ర్గంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుండే విధంగా ఫీజులతో ఉత్త‌మ విద్యార్ధుల‌ను త‌యారు చేస్తున్న కెబిఎన్ కాలేజీకి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ వ‌చ్చేందుకు కృషి చేస్తున్నాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) చెప్పారు. శ‌నివారం కెబిఎన్ కాలేజీలో జ‌రిగిన స్పోర్ట్స్ డే సెలబ్రేష‌న్స్ కి ఎంపికేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా జె.ఈ.ఈ. లో జాతీయ స్థాయిలో మొద‌టి ర్యాంక్ సాధించిన య‌శ్వంత్ సాయిను ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌న్మానించారు. అలాగే చైనాలో జ‌రిగిన ప‌వ‌ర్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చి మూడు ప‌త‌కాలు సాధించిన భ‌ర‌త్ కూమ‌ర్ , హ్యాండ్ బాల్ క్రీడాకారిణి బి.స‌త్య‌ల‌ను కూడా స‌న్మానించారు. కెబిఎన్ కాలేజీ క‌మిటీ స‌భ్యులు ఎంపి కేశినేని శివ‌నాథ్ కు మెమెంటో అందించి స‌న్మానించారు.

ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప‌రీక్ష‌ల రాబోయే విధ్యార్ధుల‌కు బెస్ట్ ఆఫ్ ల‌క్ చెప్పారు. ఇటీవ‌ల ఎస్.కె.పి.వి.వి ఎ.వో నారాయ‌ణ‌రావు ఇటీవ‌ల కాలేజీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కావాల‌ని కోర‌గ్గా, కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌టం జ‌రిగింది. త్వ‌ర‌లోనే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సెంట‌ర్ కాలేజీ కి వ‌స్తుంద‌న్నారు. విజ‌య‌వాడ న‌గ‌రం అమ‌రావ‌తిలో భాగం, ఈ విజ‌య‌వాడ న‌గరం అమ‌రావ‌తికి ముఖ ద్వారం…ఈ అమ‌రావ‌తి ముఖ‌ద్వారంలో ఎన్నో అవ‌కాశాలు రాబోతున్నాయి. హైద‌రాబాద్ లో ఎన్ని అవ‌కాశాలు వచ్చాయో అంత‌కు మించి అమ‌రావ‌తికి రానున్నాయ‌న్నారు. ఈ అవకాశాల‌ను కాలేజీ విద్యార్ధులు స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో వెస్ట్ ఎ.సి.పి దుర్గారావు, కెబిఎన్ కాలేజీ క‌మిటీ చైర్మ‌న్ టి.శ్రీనివాస‌రావు, ఎమ్.ఎస్.ఆర్ స్కూల్ ప్రెసిడెంట్ మ‌ద్ది సుబ్బారావు, ప్రిన్సిపాల్ కృష్ణ‌వేణి, కోశాధికారి గోళ్ల‌బాబా విజ‌య‌కుమార్ ల‌తోపాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *