-మోతీ మసీద్ ఈద్గా లో ఇఫ్తార్ విందుకు హాజరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కులమతాలకు అతీతంగా పేద, మద్య తరగతి ప్రజలకు ఎంతోగానో ఉపయోగపడుతున్న మోతీ మసీద్ షాదీఖానా ను అత్యాధునికంగా నాలుగుఅంతస్తుల షాదీఖానా నిర్మించేందుకు కృషి చేస్తానని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ఆహ్వానం మేరకు శనివారం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) చిట్టినగర్ సెంటర్ లోని మోతీ మసీద్ ఈద్గాలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొన్న ఎంపి కేశినేని శివనాథ్ ను ముస్లిం మత పెద్దలు, కమిటీ సభ్యులు వారి సంప్రదాయ పద్దతుల్లో సన్మానించారు.
ఇఫ్తార్ అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ సభ్యులతో మాట్లాడారు. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, టిడిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఎమ్.ఎస్.బేగ్ లద్వారా కమిటీ సభ్యులు పాతబడిన షాదీఖానను కొత్తది నిర్మించాలనే ప్రతిపాదన ఎంపి కేశినేని శివనాథ్ కి తెలియజేశారు. అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కేంద్ర వక్ఫ్ బోర్డు నిధులతో,రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అవసరమైతే తన సొంత నిధులు ఖర్చు పెట్టి అందరికీ ఉపయోగపడే విధంగా నాలుగుఅంతస్తుల షాదీఖానా నిర్మిస్తానని…అందులో రెండు అంతస్తులు షాదీఖానా కోసం, మరో రెండు అంతస్తులు మస్లిం సామాజికవర్గ యువతీ యువకులు ఉపయోగపడే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మోతీ మసీద్ షాదీఖానా ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ అక్బర్ ఖాన్, సెక్రటరీ రషీద్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ షేక్ నాగుర్, మౌలానా నజీర్ అహ్మాద్, పశ్చిమ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ రజావుల్లా, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులుఖాజా, అన్సార్, 48వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ, 42వ డివిజన్ అధ్యక్షుడు శివాజీ, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, టిడిపి సీనియర్ నాయకులు శివశర్మ, గుర్రం కొండ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News