విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పన్ను చెల్లింపు దారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు మరియు పురపాలకసంఘాలలో పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు మెరుగుపరుచుటకు, ఆస్తి పున్ను మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలన్న 31.03.2025 లోపు ఒకేసారి ఏక మొత్తంలో చెల్లింపులు చేసినట్లయితే, వడ్డీ పై 50 % రాయితీని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం 46, తేదీ: 25.03.2025 న ఉత్తర్వులు జారీ చేసిందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్ను బకాయిలున్న అనగా ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న బకాయిలు (arrear) మరియు ఈ ఆర్థిక సంవత్సరం పన్ను బకాయిల (current), 50% వడ్డీతో 31.03.2025 లోపు, ఒకేసారి ఏక మొత్తంలో చెల్లించినచో మిగతా 50% వడ్డీ రాయితీని పొందవచ్చని అన్నారు.
ఈ సదుపాయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మొత్తం వడ్డీ తో కట్టిన వారందరికీ కూడా వర్తిస్తుందని, సదరు 50 % వడ్డీ రాబోవు ఆర్థిక సంవత్సర పన్నులకు జమకాబడుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల 13 క్యాష్ కౌంటర్లలలో మూడు జోనల్ కార్యాలయలో ఉన్న ఆరు క్యాష్ కౌంటర్లను ఉదయం 8:00 నుండి సాయంత్రం 8 గంటల వరకు మార్చ్ 31, 2025 వరుకు, జోనల్ కార్యాలయేతర క్యాష్ కౌంటర్లు ఉదయం 9:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కమిషనర్ కోరారు.
Prajavartha Online Telugu News