విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల సంక్షేమం కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని గొప్పలు చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జనగణనలో కులగణనను చేపట్టాల్సిందేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని దాసరి భవన్‌లో రాష్ట్రంలో కుల జన గణనలో- కులగణనను చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో 77 సంవత్సరాల పరిపాలన లో నేటికీ దేశాభివృద్ధి ఫలాలు అనగారిన వర్గాలకు, దళిత, గిరిజన, మైనార్టీలకు చేరలేదని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన పది సంవత్సరాల కాలంలో కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతూ, ఒక్క ప్రభుత్వ రంగాన్ని కూడా స్థాపించకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ సంస్థలకు ధారధత్తము చేసి దోపిడీ చేసేందుకు అనుమతి ఇచ్చారని, విద్యా,ఉద్యోగాలు ఉపాధి కల్పనా రంగాలు దేశ సంపాదన సృష్టించే వారికి అందకుండా పోయాయని, దేశవ్యాప్తంగా నేడు కులగణనపై చర్చ జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ చర్చ లేకపోవడం బాధాకరమని సామాజిక న్యాయం జరగాలన్నా, చట్టసభల్లో ప్రాతినిద్యం ఉండాలన్నా, సామాజిక ప్రజాస్వామ్యం కావాలన్నా, ప్రభుత్వ పథకాల అర్హు లైన అవసరమైన వర్గాలకు చేరాలన్నా, కులగణన ను చేపట్టడమే ఏకైక పరిష్కార మార్గమని తెలియజేశారు. తమ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసమే పుట్టిందని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులగణనను ఎందుకు చేపట్టడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, ఉత్పత్తి,సేవ రంగాల్లో దేశానికి సేవలందిస్తున్న చేతి వృత్తి దారులకు న్యాయం జరగాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ఈ అంశాలపై రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు నివ్వాలని తద్వారా అణగారిన వర్గాలను చైతన్య పరచి ప్రభుత్వం పై వత్తిడి తీసుకొని రావాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ (ఐ) రాష్ట్ర నాయకులు కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలు, వామపక్ష లౌకిక పార్టీలు కులగలను చేపట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ కులగలను చేపట్టడానికి సిద్ధం కాకపోవడం శోచనీయమని మరొకవైపు అడ్డదారులు తొక్కి అధికారాల్లోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణనను వ్యతిరేకించే బిజెపి బీసీ ముఖ్యమంత్రులను చేయడం, గిరిజన రాష్ట్రపతిని ఎన్నుకోవడం దేశ ప్రజలను మభ్యపెట్టడానికెనని,కుల గణన పై కమ్యూనిస్టు పార్టీలు పోరాడితే తప్ప ప్రభుత్వాలు స్పందించవని ఇందులో భాగంగా చేతి వృత్తి దారుల సమాఖ్యకు అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఐ పార్టీ ఈ అంశంపై సహకరిస్తుందని తెలిపారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు, ఐద్వా ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ నేడు బిజెపి కులగణనను చేపట్టకుండా కులగణన చేపడితే సమాజ ఘర్షణలు తలెత్తి సమాజ విభజన జరుగుతుందని చెప్పడం పక్కదారి పట్టించడం నిరంతరం బలహీనులపై, గిరిజనుల, దళితులపై దాడులు ఉధృతం చేసి అణిచివేసి శాశ్వతంగా తమ పబ్బం గడుపు క్కోవడానికేనని అభివృద్ధి లో సామాజిక, ఆర్థిక కులగణనను వెల్లడిరచాలని మహిళల వెనుకబాటు తనాన్ని కూడా తెలుసుకోవచ్చని, దేశంలో కేరళ ప్రథమ కమ్యూనిస్టు ప్రభుత్వం ఎంఎస్ నంబూది త్రిపాద్ ప్రభుత్వం కులగనన చేపట్టడం ద్వారానే విద్యా, సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి సరైన చర్యలు తీసుకున్నందువల్లనే అక్షరాస్యతలో,అభివృద్ధిలో దేశంలోనే కేరళ ప్రథమ స్థానం పొందిందని తెలిపారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ శాసనమండలి సభ్యులు జల్లివిల్సన్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కులగణనను చేపట్టి ధైర్యంగా వివరాలు వెల్లడిరచడం అభినందనీయమని, దేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేశారన్నారు. ఔనాన్న, కాదన్నా కుల సామాజిక వ్యవస్థ పై ఆధారపడిన భారతదేశం అభివృద్ధి పలితాలు అందరికీ చెందాలంటే కుల గణన చేపట్టడమే ఏకైక పరిష్కారమార్గమన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకులు కళ్యాణకృష్ణ, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కరయ్య, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి బుట్టి రాయప్ప, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర నాయకులు నటరాజ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పంచదార దుర్గాంబ, ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ అప్సర్, తెలుగునాడు టి ఎన్ టి యు సి గీత కార్మిక సంఘం నాయకులు వాకా వెంకటేశ్వరరావు, అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్ర ప్రసాద్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జి, ఆంధ్ర ప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్, రాష్ట్ర కోశాధికారి పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడుపు కన్నయ్య గొట్టిముక్కల బాలాజీ, చేతి వృత్తి దారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య, ఆంధ్రప్రదేశ్ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగాంజనేయులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడిపైడయ్య, రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బుద్దారపు వెంకట్రావు, సి. నాగప్ప, రాచాకుల శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు పి.మాలకొండయ్య, కల్లుగీత కార్మిక పనివారల సంఘం రాష్ట్ర నాయకులు కంచర్ల కాశయ్య, శాలివాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపనపల్లి వీరాంజనేయులు, స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నాయకులు సింహాద్రి దుర్గారావు, వీధి విక్రయ దారుల సంఘం (ఎఐటీయుసి ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వర రావు, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు ఎం కారన్న, ఎం రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా చేనేత కార్మిక సంఘం నాయకులు బాబ్జి పాల్గొని ప్రసంగిస్తూ సంపూర్ణ మద్దతు తెలియజేసారు. అన్ని జిల్లా ల్లో ఈ అంశం పై ఏప్రిల్ 15వ తేది లోపు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని, ప్రభుత్వం వత్తిడి తెచ్చేందుకు దశలవారీగా కార్యక్రమం చేపట్టాలని సమావేశం పిలుపునిచ్చింది..
Prajavartha Online Telugu News