-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మోడ్రన్ ఫిష్ మార్కెట్ వృద్ధాశ్రయంలో వసతులన్నీ కల్పించాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాష్ నగర్ లో గల మోడ్రన్ ఫిష్ మార్కెట్, రాజీవ్ నగర్ లో గల వృద్ధాశ్రమాన్ని, అజిత్ సింగ్ నగర్ లో గల అన్నా క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మోడ్రన్ ఫిష్ మార్కెట్లో వ్యాపారస్తులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలని కల్పించాలని నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. తదుపరి రాజీవ్ నగర్ లో గల వృద్ధాశ్రమాన్ని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆశ్రమంలో ఉండే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరమతులన్నీ త్వరితగతిన చేయాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి అజిత్ సింగ్ నగర్ లో గల అన్న క్యాంటీన్ ను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు, ఆహారం కోసం వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, తాగునీటి సరఫరా వాడుకునేటి సరఫరా ప్రతినిత్యం ఉండాలని, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని ప్రజల అభిప్రాయాలను కనుక్కొని ఎప్పటికప్పుడు ఎటువంటి లోపాలున్న వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో ఇంచార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News