Breaking News

లేఔట్ క్రమబద్దీకరణ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుటకు ఈ నెల 31 వరకు మాత్రమె గడువు….

-లేఔట్లు, ప్లాట్లు మరియు అనధికార కట్టడాలు క్రమబద్దీకరించుకొనుటకు లేఔట్ క్రమబద్దీకరణ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుటకు ఈ నెల 31 వరకు మాత్రమె గడువు….కమిషనర్ పులి శ్రీనివాసులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అనధికార లేఔట్లు, ప్లాట్లు మరియు అనుమతి లేకుండా మరియు అనుమతి పొందిన ప్లానుకు భిన్నంగా నిర్మించిన భవన సముదాయాలను లేఔట్ స్కీం మరియు బి.పి.యస్ ద్వారా క్రమబద్దీకరించుకొనుటకు ఈ నెల మార్చి 31వ తేదీ వరకు మాత్రమె గడువు కలదని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్  ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతి లేని లేఔట్లు మరియు ప్లాట్లను క్రమబద్దీకరించుకొనుటకు లేఔట్ క్రమబద్దీకరణ స్కీం – 2020 మరియు అనుమతి లేని మరియు అనుమతి తీసుకున్న ప్లానుకు భిన్నంగా నిర్మించిన భవన నిర్మాణాలు క్రమబద్దీకరించుకొనుటకు బి.పి.యస్ స్కీం – 2019 ద్వారా ప్రభుతం వారు ఉత్తర్వులు జారీ చేయుట జరిగింది. సదరు స్కీంల ద్వారా లేఔట్స్, ప్లాట్లు మరియు భవన నిర్మాణాలు క్రమబద్దీకరించుకొనుటకు ఈ నెల మార్చి 31 వ చివరి గడువుగా ప్రభుత్వం వారు నిర్ణయించి యున్నారు.
కావున నగర ప్రజలు ప్రభుత్వం వారు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 31-3-2025 లోపు అనుమతి లేని మీ యొక్క లేఔట్లు, ప్లాట్లు మరియు భవనసముదాయములను క్రమబద్దీకరించుకోవాలని కమిషనర్ తెలియచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *