గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రైతు సాధికార సంస్థ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బి. రామారావు స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ, సెర్ప్ సంస్థల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తోందని, జాతీయ స్థాయిలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) కార్యక్రమ అమలు లో భాగంగా మేనేజ్ జాతీయ సంస్థ ఆర్థిక సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(APCNF) ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై ముడురోజుల రాష్ట్రస్థాయిశిక్షణా కార్యక్రమంగుంటూరు పట్టణంలోని రాయల్ పార్క్ హోటల్ నందుఈ రోజు బుధవారం ప్రారంభమైనది. ఈ శిక్షణ కార్యక్రమం లోరాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వ్యవసాయ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, సెర్ప్ నుంచి డీపీఎం, ఏపీఎం లుపాల్గొన్నారు.ఈ సంధర్భంగా రైతు సాధికార సంస్థ సలహాదారులు,రిటైర్డ్ ఐఏ ఎస్ అధికారి శ్రీ డాక్టర్ డీవీ రాయుడుమాట్లాడుతూ రసాయనిక వ్యవసాయం కారణంగా మొక్కలు మరియు సూక్ష్మజీవుల మధ్య ఉండేసంబంధం బాగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిలో ఉచితంగా లభ్యం అయ్యే సూర్యకాంతిని వ్యవసాయ రంగానికి సమర్థవంతంగా సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారాపంట ఉత్పాదకతను పెంచుకోవచ్చనితెలిపారు.ప్రొఫెసర్ దబోల్కర్ పరిశోధనలను ప్రస్తావిస్తూబహుళ పంటల సాగు విధానాలుఒక ఎకరా విస్తీర్ణంలో ఐదు ఎకరాలకు సమానమైన ఉత్పాదకతగా మార్చగలవని వివరించారు.
పెరుగుతున్న సాగు ఖర్చులు, నీటి కొరత, పర్యావరణ సంక్షోభాలుప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు.అధిక రసాయనిక ఎరువుల వినియోగంకారణంగాభూసారం తగ్గిపోవడం, కార్బన్ ఉద్గారాలు పెరగడం, నీటి కాలుష్యంవంటి ప్రభావాలు కనిపిస్తున్నాయని, ఏలూరు ఘటనలో భారీ లోహాల కలుషిత నీరుఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.1970లో హెక్టారుకు 13 కేజీలు గా ఉన్నఎరువుల వినియోగం 2022నాటికి 190 కేజీలకు పెరిగిందని, ప్రపంచంలో అత్యధికంగా ఎరువులను వినియోగిస్తున్నదేశాల్లో ఇండియా నాలుగవ దేశంగా మారిందనివివరించారు. అత్యధిక ఎరువుల వినియోగం కారణంగా ఆహార పోషక విలువలు తగ్గిపోవడం, తీవ్రమైన వేడిగాలులు, తుఫాన్లు పెరగడం, రైతుల ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంవంటి ప్రతికూల పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలియజేశారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ప్రకృతి వ్యవసాయం సమగ్ర పరిష్కారంగా నిలుస్తుందనిపేర్కొన్నారు. జీవామృతం వంటి జీవ ఉత్ప్రేరకాల వినియోగంతో 365రోజులపాటు పంటలు పండించడం, నీటి సంరక్షణ పద్ధతులు అనుసరించడం వంటి చర్యల ద్వారా వ్యవసాయాన్నిసుస్థిరంగాతక్కువ ఖర్చుతో కొనసాగించవచ్చనివివరించారు. APCNF మోడళ్ళనురాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో నిర్వహిస్తూరైతులకు సామూహిక అవగాహన కల్పించడం ద్వారా క్షేత్రస్థాయిలో ఉత్తమ రైతుల ప్రోత్సాహం, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంవంటి అంశాలు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ అమలులో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తక్షణమే ప్రకృతి వ్యవసాయ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందనిఅభిప్రాయపడ్డారు. ప్రకృతి వ్యవసాయం ద్వారాభూసారం మెరుగుపడి, దిగుబడి పెరిగి, ఆహార పోషక విలువలు మెరుగవ్వడంతో పాటు పర్యావరణ స్థిరత్వం సాధ్యమవుతుందని అన్నారు.జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ (NMNF) ఉద్యమంరసాయనాలపై ఆధారపడకుండా, రైతులకు స్వావలంబన పెంచేందుకు దోహదం చేయడం లక్ష్యంగా పెట్టుకుని, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నట్లుఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు,ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, మేనేజ్ సంస్థ టెలీ సలహాదారు ఐశ్వర్య, సీనియర్ థిమాటిక్ లీడ్ లు శ్రీ చంద్రశేఖర్, గోపిచంద్, డాక్టర్ జాకీర్ హుసేన్, థి మాటిక్ లీడ్ శ్రీ సురేష్, సీనియర్ రిసోర్స్ పర్సన్ శ్రీ రామచంద్రం, రాజేశ్వర్ తదితరులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News