గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు సాంఘిక మరియు గిరిజన సంక్షేమ శాఖలుసంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో డీఎస్పీ శిక్షణ ఇచ్చుటకు నిర్ణయం జరిగింది. ఈ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన శిక్షణ సంస్థల యందు మరియు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న Study Circles నందు నిర్వహించబడుతుంది. అయితే ఈఉచిత డీఎస్పీ శిక్షణ కోసం షార్ట్‌లిస్ట్ చేసిన SC & ST అభ్యర్థుల జాబితాలు జ్ఞానభూమి వెబ్ పోర్టల్ మరియుhttps://mdfc.apcfss.inల యందు సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు ప్రకటించినారు. కనుక డీఎస్పీ శిక్షణ కొరకుషార్ట్‌లిస్ట్ చేయబడినSC & ST అభ్యర్థులు అందరూ జ్ఞానభూమి వెబ్ పోర్టల్ మరియుhttps://mdfc.apcfss.inనందు తమశిక్షణ కొరకు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు తమప్రాధాన్యతలనుపైన తెలిపిన పోర్టల్స్ నందు 2వ విడతగా రిజిస్టర్ చేసుకోను నిమిత్తము చివరి తేది ది.28-03-2025, కనుక ఎన్నిక కాబడిన అభ్యర్థులు తమ ప్రాధాన్యతలను పై తేదీలోపు ఆన్లైన్ నందు ఇన్స్టిట్యూట్ లను ఎంపిక చేసుకోనవలసినదిగా జిల్లా షెడ్యూల్డ్ కులముల సంక్షేమము మరియు సాధికారిత అధికారి, గుంటూరువారు తెలియజేసినారు.
Tags guntur
Check Also
మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …
Prajavartha Online Telugu News