Breaking News

గుంటూరులో చిల్లీ కాంక్లేవ్ పేరిట ఒక పెద్ద స‌ద‌స్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రాధాన్యతమైన వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇండస్ట్రీ రంగం, సర్వీస్ రంగాల్లో 2025 – 26 సంవత్సరానికి 15 శాతం వృధ్ది లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించటం జరిగిందని, వ‌చ్చే సెప్టెంబ‌రులో గుంటూరులో చిల్లీ కాంక్లేవ్ పేరిట ఒక పెద్ద స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నామ‌ని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు.
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 3వ కలెక్టర్ సమావేశంలో బుధవారం రెండవ రోజు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళికను మరియు జిల్లాకు సంబంధించిన నిర్ధిష్ట సమస్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయం, హార్టికల్చర్, పశువులు, అడవులు, ఫిషింగ్ మరియు ఆక్వా, ఇండస్ట్రీ రంగంలో మైనింగ్ మరియు క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, విద్యుత్తు, గ్యాస్ మరియు నీటి సరఫరా, నిర్మాణం సర్వీస్ రంగంలో ట్రేడ్, హోటల్స్, మరియు రెస్టారెంట్లు, రైల్వేస్, ట్రాన్స్ పోర్టు, స్టోరేజీ, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ , ఓనర్ షిప్ ఆఫ్ డ్వాలింగ్స్, ప్రోఫిషనల్ సర్వీస్, ఇతర సర్వీసులు, సంక్షేమం, లా అండ్ ఆర్డర్ వంటి 19 ప్రముఖ రంగాలలో గ్రోత్ రేట్ పెరుగుదలకు నిర్దేశిత లక్ష్యాలు, వాటిని అధిగమించేందుకు నిర్దేశించుకున్న సమయాలను తెలుపుతూ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలలో జీడీవీఏ వృద్ధి రేటు 14.90% , ఇండస్ట్రీ రంగానికి 21.29 శాతం, సర్వీస్ రంగంలో 16.01 శాతం లక్ష్యంగా 2025 – 26 ప్రణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో జీడీవీఏ లో ఉద్యాన పంటలు, పశుసంవర్థక శాఖలు ప్రధానమైనవన్నారు. స‌చివాల‌యంలో జ‌రిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆమె త‌మ జిల్లా ప్ర‌గ‌తికి సంబంధించి ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. గుంటూరులో మిర్చి సాగు విస్తారంగా చేస్తార‌ని, ప్ర‌స్తుతం జిల్లాలోని శీత‌ల గోదాముల్లో 40 ల‌క్ష‌ల బ‌స్తాల మిర్చి ఉంద‌న్నారు. ఎగుమ‌తి మార్కెట్ ప్ర‌స్తుతం ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డంతో మంచి ధ‌ర‌ల కోసం రైతులు త‌మ పంట‌ను గోదాముల్లో భ‌ద్ర‌ప‌ర‌చుకున్నార‌ని తెలిపారు.
వ్యవసాయం రంగంలో రబీలో పంటల సాగును 86,000 హెక్టార్ల నుంచి 91,000 హెక్టార్లకు, ప్రకృతి వ్యవసాయం ను 26,000 హెక్టార్ల నుంచి 50,000 హెక్టార్లకు, కౌలు రైతులకు పంట రుణాలు రూ 58 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికోసం సాయిల్ ఫెర్టిలిటినీ పెంచేలా పీఎండీఎస్ కిట్ లను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఉద్యాన పంటలలో గ్రోత్ ఇంజిన్ పంటలైన మిరప, పసుపు, కురగాయలు, పూల సాగును 17800 హెక్టార్ల నుంచి 18400 హెక్టార్లకు పంటల సాగును పెంచాలని, మైక్రో ఇరిగేషన్ పంటల సాగును 12100 హెక్టార్ల నుంచి 14,500 హెక్టార్లకు పెంచాలని, పోస్ట్ హార్వేస్ట్ మ్యానేజ్మేంట్ మరియు ప్రోడక్ట్ పరఫక్షన్ కు సంబంధించి రూ. 16 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికల్లో రూపొందించామన్నారు. దీని కోసం పంటలలో చీడ పురుగుల నివారణకు మిలిందా ఫౌండేషన్ తో ఈ మిర్చిని డిజిటల్ గ్రీన్ ద్వారా అమల్లోకి తీసుకు వస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి 1.3 మెట్రీక్ టన్నుల దాణాను వృద్ది చేసేలా, పాలిచ్చే గేదేలను, కోళ్ళ పెంపకానికి 2000 నూతన యూనిట్స్ ఏర్పాటుతో పాటు, 60 లక్షల లీటర్ల అదనపు పాల ఉత్సత్తి కి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఫిషింగ్ మరియు అక్వా రంగానికి సంబంధించి ఫిష్ సీడ్ ను 49,000 మెట్రిక్ టన్నుల నుంచి 62,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని, పీఎంఎంఎస్వై పథకాలకు 0.93 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. అడవుల విస్తీర్ణం, పచ్చదనం పెంపుదలలో బాగంగా నర్సరీ పెంపుదలకు ఐదు లక్షల విత్తనాలు, శాంపిల్లింగ్ ప్లాంటేషన్ కు 8 లక్షల శాంప్లింగ్స్, ఐదు వెట్ ల్యాడ్స్ ను డిమార్కింగ్ చేయటం జరుగుతుందన్నారు.
ఇండస్ట్రీ రంగానికి సంబంధించి మెనింగ్ మరియు క్వారింగ్ లో 40 నాన్ వర్కింగ్ మెటల్ లీజ్ ద్వారా 20 లక్షల మెట్రీక్ టన్నులు, 20 నూతన గ్రావెల్ లీజ్ ద్వారా 10 లక్షల క్యూబిక్ మెటల్, 30 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలు చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. మాన్యుఫ్యాక్టరింగ్ లో 2500 నూతన ఎంఎస్ఎంఈల ఏర్పాటు, రెండు మెగా ఇండస్ట్రీలకు 304.75 హెక్టార్లు భూసేకరణ చేయటం జరుగుతుందన్నారు. విద్యుత్ నెట్ వర్కింగ్ 10 శాతం పెంపుదలకు (3700ఎంయూ నుంచి 4200ఎంయూ) రూ. 111.33 కోట్లు ఖర్చు చేయాలని, గ్రీన్ ఎనర్జీ పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా 56 మెగావాట్లు , ఎంటీఎంసీ లోని ఐఓసీఎల్ ద్వారా 5000 ఇళ్ళకు పైపు ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని, జల్ జీవన్ మిషన్ ద్వారా 25,000 ఇళ్ళకు వ్యక్తిగత కుళాయిలు, 4 ఎంఎల్డీ వాటర్ సోర్స్ పెంపుదలకు, పట్టణ ప్రాంతాల్లో 25,000 ఇళ్ళకు వ్యక్తిగత కుళాయిలు ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నిర్మాణాలకు సంబందించి రహదారులు (ఆర్ అండ్ బీ, పీఆర్ మరియు మున్సిపల్) రూ.233.96 కోట్లతో 142 కీమీ నిర్మాణం, జాతీయ రహదారి ఎన్ హెచ్ 16 నాలుగు కీలోమీటర్లు ఆరులైన్లు రహదారికి, రెండు మూడు లైన్ల ఆర్వోబీలు రూ. 454.24 కోట్లుతో , గుంటూరులో శంకర్ విలాస్ ఆర్వోబీ , 200 మీటర్ల అప్రోచ్ రోడ్లు రూ.40 కోట్లతో నిర్మించాలని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. సర్వీస్ రంగానికి సంబంధించి లక్ష్యాలను వివరించారు.
జిల్లా యొక్క జీడీవీఏ 82293 (17.36 శాతం) , జీడీడీపీ 89639 (17.96 శాతం) ప్రజల పర్ క్యాపిటల్ ఇన్కమ్ రూ.3,54,268 (17.66 శాతం) సాధించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

కార్యాచరణ ప్రణాళికతో పాటు జిల్లాకు చెందిన గుంటూరు నగర పాలక సంస్థలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆర్ధిక సహాయం, మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థలో యూజీడీ పనులకు, మంచినీటి సరఫరా విస్తరణకు, గుంటూరు ఛానల్ అధునీకరణ, విస్తరణకు నిధులు, చినకాకాని, మల్లయపాలెంలో ఇండస్ట్రీల పార్కు ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు రూ.625 కోట్లు నిధులు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న మెటర్నిటీ వార్డులో పరికరాలు, ఫర్నిచర్ కు అవసరమైన నిధులకు ప్రభుత్వ సహకారం కావాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగింది.
వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పెండింగ్ లో ఉన్న యూజీడీ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎంటీఎంసీ పరిధిలో యూజీడీ, మంచినీటి సరఫరాకు సీఆర్డీఏ ద్వారా నిధులు కేటాయింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ, విస్తరణకు, చినకాకాని, మల్లయపాలెం వద్ద ఇండస్ట్రీ పార్కు భూసేకరణకు నిధులు మంజూరు చేయటం జరుగుతుందన్నారు. జీజీహెచ్ లో మెటర్నీటీ వార్డులో పరికరాలు , ఫర్నీచర్ నిధులు మంజూరుపై వైద్యారోగ్యశాఖ అధికారులు పరిశీలన చేయాలన్నారు.
కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా. నరిసింహారావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మీ, సీపీఓ శేషశ్రీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *