వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త :
ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆదివారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన విద్య, ఐటీల శాఖమంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) , ఎసిఎ వైస్ ప్రెసిడెంట్ వెంకట రామ ప్రశాంత్, ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ లతో కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు. ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా లకు వివరించి చూపించటం జరిగింది. స్టేడియం ఆధునీకరణ పనులపై మంత్రి నారా లోకేష్, ఐసీసీ ఛైర్మన్ జైషా హర్షం వ్యక్తం చేయటంతోపాటు ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని అభినందించారు. అనంతరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ వీక్షించారు.
Prajavartha Online Telugu News