Breaking News

దస్త్రాలను సత్వరమే పరిష్కరించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కలెక్టరేట్లో పెండింగ్లో ఉన్న పలు అంశాలకు చెందిన దస్త్రాలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టరేట్ లోని వివిధ విభాగాల సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్లో ఉన్న దస్త్రాలను సమీక్షించారు. కారుణ్య నియామకాలు, భూ సంబంధ సమస్యలు, పిజిఆర్ ఎస్ అర్జీలను, సిబ్బంది ఫిర్యాదులు, పదోన్నతులు తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. ఈ ఆఫీస్ ద్వారానే వస్త్రాలన్నీ నిర్వహించాలని ఆదేశించారు. ఇకపై ప్రతినెల సమావేశం నిర్వహించి దస్త్రాల పురోగతిని సమీక్షిస్తామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఎస్ డి సి శ్రీదేవి, ఏవో ఆంజనేయ ప్రసాద్, కలెక్టరేట్ వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *