బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత

-1800 425 4156, 1098 , 1091 సమాచారం అందించండి
-డీఆర్వో సీతారామ మూర్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్య వివాహాలు నిరోధించడానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, బాల్య వివాహాలు నిరోధించడం సామాజిక బాధ్యత అని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ సంచాలకులు ఎమ్. వేణుగోపాల్ రెడ్డి బాల్య వివాహ నిరోధక కార్యాచరణ ప్రణాళిక పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి డి ఆర్వో ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి గ్రామం, పంచాయతీ, బ్లాక్, పట్టణ/వార్డు మరియు జిల్లా తహసీల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. ఏప్రియల్ 30 వ తేదీన అక్షయ తృతీయ రోజున బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉందని, వాటిని సమర్థవంతంగా నిరోధించడం కోసం క్షేత్ర స్థాయిలోని అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని, అటువంటి సమాచారం అందించి, బాల్య వివాహాలు నిరోధించడానికి సహకరించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్లు (CDPOలు), చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWCలు), చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్లు (CWPOలు), అంగన్‌వాడీ వర్కర్లు (AWWs) ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వివాహాలకు బాధ్యత వహించే మత పెద్దలు, పురోహితులు , ఫంక్షన్ హాల్స్ , వాయిద్య, క్యాటరర్స్ , డెకరేటర్స్ నిర్వాహకులు, ఇతర కీలక వాటాదారులతో బాల్య వివాహాలకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలపై సమావేశాలను నిరోధించడం కోసం వారి సహాయాన్ని అందించడంపై ప్రత్యెక డ్రైవ్ నిర్వహించాలన్నారు. బాల్య వివాహలు జరిగే సందర్భాల్లో ముఖ్యంగా పాఠశాలల వారీగా చదువు మానేసిన, బడి మానేసిన లేదా సక్రమంగా హాజరుకాని పిల్లల జాబితాను రూపొందించడం, బాల కార్మికుల (నిషేధం మరియు నియంత్రణ) సవరణ నియమాలు, 2017లోని రూల్ 2B (2) ప్రకారం, ప్రిన్సిపాల్ లేదా హెడ్ మాస్టర్‌కు సరైన సమాచారం లేకుండా పాఠశాలకు గైర్హాజరైన పిల్లల జాబితాను పాఠశాల వారీగా సిద్ధం చేయలన్నారు. సదరు జాబితాను తప్పనిసరిగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేసి, జిల్లా మేజిస్ట్రేట్ (DM) లేదా జిల్లా బాల్య వివాహ నిషేధ అధికారి / జిల్లా కలెక్టర్ కు అందచెయ్యాలన్నారు. సదరు జాబితా నుండి బాల్య వివాహాల ప్రమాదంలో ఉన్న పిల్లలను గుర్తించడంలో, బాల్య వివాహాలను సమర్థవంతంగా నిరోధించడానికి కుటుంబ కౌన్సెలింగ్ చెయ్యవలసి ఉందన్నారు.

జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్న ఘటనలు విషయంలో తగిన సమాచారాన్ని జిల్లా యాత్రాంగం దృష్టికి తీసుకుని రావాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి విజ్ఞప్తి చేశారు. సంబంధించిన సమాచారాన్ని తూర్పు గోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ 1800 425 5041,  చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ,  మహిళా హెల్ప్ లైన్ 1091  సమాచారం అందించండం ద్వారా వాటిని సమర్థవంతంగా నిరోధించడం సాధ్యం అవుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తెలియ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి, జిల్లా పాఠశాల విద్యాధికారి కే వాసుదేవరావు, ఎస్ ఎస్ ఎ పి డి ఎస్ సుభాషిణి , సహాయ కార్మిక కమీషనర్ బీఎస్ఎమ్ వలి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *