Breaking News

నగర పరిశుభ్రతపై రాజీలేదు – విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

-నగర పరిశుభ్రత పై రాజీ పడేది లేదని

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, రామవరప్పాడు రింగ్, నేషనల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, సంబంధిత అధికారులు ప్రతి రోజు సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. అధికారులు, కార్మికులు సమన్వయంతో పనిచేయాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. రోడ్లపై చెత్త వేయడం, అనధికారికంగా వ్యర్థాలు పడేయడం వంటివి నివారించాలని హెచ్చరించారు. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *