Breaking News

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి R.S. బ్రదర్స్ మాల్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఏలూరు రోడ్, V9 cloth షోరూమ్, లెనిన్ సెంటర్ మరియు చందనా బ్రదర్స్ షో రూమ్ లను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్, N. వెంకటేశ్వరరావు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ D. మాల్యాద్రి మరియు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ M.రాజా మరియు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *