Breaking News

పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేసిన బీజేపీ నేతలు

-పాకా వెంకట సత్యనారాయణని అభినందించిన పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాకా వెంకట సత్యనారాయణ రాజ్యసభ అభ్యర్థిత్వానికి మద్దతు తెలియచేసినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచేశారు. మంగళవారం రాత్రి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్, రాజ్యసభ అభ్యర్థి పాకా వెంకట సత్యనారాయణ, బీజేపీ ప్రధాన కార్యదర్శులు మధుకర్, శివన్నారాయణ,  దయాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్  రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన  పాకా వెంకట సత్యనారాయణ ని సత్కరించి అభినందించారు. ఆయన సేవలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  అమరావతి పర్యటన విషయాలు, పలు వర్తమాన అంశాలు చర్చకు వచ్చాయి. సత్యకుమార్ ‘సత్య కాలమ్’ పేరిట తను రాసిన వ్యాసాల సంకలనాలను పవన్ కళ్యాణ్ కి అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *