గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి పన్నును ఏక మొత్తంలో పన్ను చెల్లింపులు మరియు పాత బకాయిలను చెల్లించి 50శాతం వడ్డీ రాయితీని వినియోగించుకున్న న్యాయవాది పులివర్తి శ్రీనివాస్ ను అభినందించిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర. బుధవారం పులివర్తి శ్రీనివాస్ తన వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన 10 అసెస్మెంట్లకు గాను రూ.1,50,000 మరియు పాత బకాయిలను చెల్లించి, సదరు రసీదులను మేయర్ కి ఆయన ఛాంబర్ నందు అందజేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి 5 శాతం రాయితీ అవకాశాన్ని కల్పించిందని, ఇప్పటికే నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం అందించిన 5 శాతం రాయితీని వినియోగించుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ఆర్థిక సంవత్సరం బకాయిలను చెల్లించి 50 శాతం వడ్డీ రాయితీని కూడా ఆయన తిరిగి పొందారన్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన చెల్లించిన బకాయిలకు మొత్తం 20 వేల రూపాయలు మేర రాయితీ పొందారన్నారు.
Prajavartha Online Telugu News