Breaking News

అభివృద్ధి అంటే రైతుల భూములను డొల్ల కంపెనీలకు కట్టబెట్టడమా…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“అభివృద్ధి అంటే రైతుల భూములను డొల్ల కంపెనీలకు కట్టబెట్టడమా” అన్న అంశం మీద విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ లో అమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలతో కలిపి శనివారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో అమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అవసరం అభివృద్ధికి అవసరమైన భూ సేకరణ రాయితీలు ఇవ్వవలసిన అవసరం ఉంది అని భావించే మాలాంటి వాళ్ళము Indosol లాంటి కంపెనీలకు భూములు ఇవ్వొద్దు అని రైతులకు చెప్పవలసిన పరిస్థితి అంటే దురదృష్టకరమైన అంశం అని అన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు దగ్గర సోలార్ ప్రాజెక్టు కోసం Indosol కంపెనీని స్థాపించి భూములను తీసుకున్న విశ్వేశ్వర్ రెడ్డి చరిత్రను పరిశీలిస్తే 2018 కి ముందు ఆయన ఆర్థిక స్థితిగతుల మీద Crisil లాంటి సంస్థలు నివేదికలు చూస్తే అర్థమవుతుందన్నారు. అలాంటి విశ్వేశ్వర్ రెడ్డి 2024 వచ్చే సమయానికి పెద్ద పారిశ్రామిక అవతరించడం ఆశ్చర్యం కలిగించే అంశం అని అన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి చరిత్రను గమనిస్తే డొల్ల కంపెనీలలో డైరెక్టర్ గా ఉన్న పరిస్థితులను గమనించవచ్చు అన్నారు.

ఒకప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న indosol కంపెనీకి కరేడు ప్రాంతంలో ఉన్న భూములను కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న పరిస్థితులను గమనిస్తే రామాయపట్నం కరేడు ప్రాంత రైతులు బిజెపి వైఎస్ఆర్సిపి టిడిపి అన్ని పక్షాలు కలిపి పనిచేస్తున్న సిండికేట్ తో యుద్ధం చేస్తున్నారని ఆ యుద్ధంలో కందుకూరు ప్రాంత రైతుబిడ్డగా కందుకూరి అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా కందుకూరు అసెంబ్లీ అమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ గా అండగా ఉంటానని చెప్పడం జరిగిందన్నారు.

సతీష్ అబ్బూరి చరిత్రను చూస్తే కేశినేని చిన్నితో వ్యాపార లావాదేవీలు ఉన్న వ్యక్తి అని అలాగే కేశినేని చిన్ని సంబంధించిన కంపెనీలను, వ్యక్తులను గమనిస్తే కంపెనీలు పెట్టి మూసేసి చరిత్ర ఉన్న వీళ్ళందరికీ ఇన్ని కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయి ఉందా వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు అని ప్రశ్నించడం జరిగింది. రెండు లక్షల ఎకరాలను సేకరించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్న లోకేష్ బాబుని అంత భూమిని సేకరించాలనుకోవడంలో ఉద్దేశం Indosol, URSA లాంటి డొల్ల కంపెనీలకు భూములు కేటాయించడం కోసమేనా అని అడుగుతున్నామని అన్నారు.

వడ్డే శోభనాదీశ్వర రావు మాట్లాడుతూ గతంలో భూములు లాక్కున్న రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన లేపాక్షి వాన్ పిక్ భూములను రైతులకు ఇచ్చి రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు.రామాయపట్నం రైతులకు వచ్చిన కష్టం వాళ్లది ఒక్కరిదే కాదు రాష్ట్రంలో మరిన్ని భూసేకరణ జరుగుతున్న పరిస్థితులలో మొత్తం రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు రాబోతున్నాయని అన్నారు. విభజన హామీ ప్రకారం రామాయపట్నం ని పెద్ద పోర్టుగా తీర్చిదిద్దే ప్రకాశం జిల్లా NIMZ ప్రాజెక్టుకు భూములను కేటాయించి అభివృద్ధి చేస్తే కోర్టు పరిసర ప్రాంతాల తో పాటు ప్రకాశం జిల్లాలో ఉపాధి కలిగి వలసలు తగ్గుతాయని అన్నారు. అలాగే బీపీసీఎల్ ప్రాజెక్టుని కాకినాడ మచిలీపట్నం మధ్యలో పెడితే బాగుంటుందని అన్నారు.

కరేడు రైతు నాయకుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ రామాయపట్నం పరిధిలో కార్పొరేట్ల కోసం గత ప్రభుత్వం నమ్మించి గొంతుకోసిన పరిస్థితి అప్పటి మహేందర్ రెడ్డి మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మించి భూములను తీసుకున్న పరిస్థితి అయితే ఇప్పటి ఎమ్మెల్యే మాట్లాడలేని పరిస్థితి అలాగే రైతులను పట్టించుకోకుండా భూ సేకరణ కార్యక్రమానికి ముందు వెళ్తున్న అ ప్రజాస్వామ్యక పరిస్థితులలో సోదరుడు నేతి మహేశ్వర రావు వడ్డే శోభనాదీశ్వరరావు లాంటి జాతీయ నాయకులతో విజయవాడలో సమావేశం పెట్టడం కొండంత అండనిచ్చిందని అన్నారు ఇలాగే మీరు అందరు కూడా మా ప్రాంతానికి రావలసిందిగా కోరుతున్నామన్నారు.

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుంకర పద్మ మాట్లాడుతూ కరేడు ప్రాంతం రైతులు సిండికేట్ తో పోరాటం చేస్తున్న ఈ పరిస్థితులలో సోదరుడు నేటి మహేశ్వరరావు సిండికేట్ కి ఎదురు వెళ్లడం ఆ ఎదురు వెళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీగా మేము అండగా ఉంటామన్నారు.

సిపిఐ నాయకులు ఈశ్వరయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగినదే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతుంది అని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన టిడిపి వాళ్ల వైయస్సార్సీపి నాయకుల దగ్గర కమిషన్ను తీసుకుని మంగపేట బాక్సైడ్స్ అలాగే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అలాగే షిరిడి సాయి కంపెనీతో ఒప్పందం గురించి మాట్లాడడం జరిగింది. ఈ రెండు పార్టీలు కింద స్థాయిలో గ్రూపు రాజకీయాలు చేస్తూ పై స్థాయిలో కలిసి పనిచేస్తున్నాయి పై స్థాయిలో కలిసి బిజెపితో ఉంటున్నాయన్నారు.

ముస్లిం లీగ్ పార్టీ నాయకులు ఖాజావలి మాట్లాడుతూ ముస్లిం సమాజంగా మేము ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామని రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి ఉన్నా మీ ముందు మేము ఉంటాము అని మీ సమస్యలను మా పార్లమెంట్ సభ్యులకు దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంట్లో మాట్లాడేలా మా వంతు కృషి మేం చేస్తామని కరేటి ప్రాంత రైతులకు మా వంతుగా మేము అండగా ఉంటామన్నారు.

ఎంఐఎం పార్టీ సభ్యులు బాజీ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీగా ఎప్పుడు రైతుల పక్షాన నిలబడతామని చెప్పడం జరిగినది అలాగే ప్రజా పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు పర్వతనేని హరికృష్ణ (వివర్దన ఫౌండేషన్) మాట్లాడుతూ ఈ ఉద్యమానికి మా వంతుగా ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రాజేశ్వరరావు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు బాలాజీ రెడ్డి కందుకూరు రైతు నాయకులు తోకల వెంకటేశ్వర్లు విజయవాడ ముస్లింలకు నాయకులు ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

26న విజయవాడలో సీపీఐ రౌండ్ టేబుల్‌కు ఆహ్వానం

-కరువుపై ఐక్య పోరాటాలు -పార్టీలకతీతంగా కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి పెంచాలి -ఖరీఫ్ రైతుల ఆందోళనకరం -55 లక్షల ఎకరాల్లో విత్తనాలే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *