విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరం లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన నొప్పులు పై అవగాహన సదస్సు లో యోగ శక్తీ సాధన సమితి వ్యవస్థాపచైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొన్నారు.మనలో వచ్చే నొప్పులకు రెండు ప్రధాన కారణాలు ఒకటి భాహ్య కారణాలు, రెండు అంతర కారణాలు. భాహ్యకారణాలు మూలంగా వచ్చే నొప్పులకు ఆయా ప్రాంతాలను ప్రాణశక్తి పెంపుతో నయం అవుతాయి. ఇలాంటి వాటికి సమయం ఎక్కువ కాలం పట్టవచ్చు కానీ రెండవ కారణమైన ఇంటర్నల్ రీజన్స్ మూలంగా వచ్చే సమస్యలను రెండు ప్రధాన విధానాలను ఉపయోగించి తగ్గించు కోవచ్చు,అది ఒకటి మనలో ఉండే శివ పార్వతి తత్వాలు, రెండవది మనలోనిఅంతర పంచభూతాలను సమస్థితికి తేవడం ద్వారా నొప్పులను గణనీయంగా త్వరతగతిన తగ్గించుకోవటానికి ఈ ప్రాణ శక్తి మార్గం బాగా ఉపయోగపడుతుంది. ఈ అంతర పంచభూతాలు ఎవరు అని చూస్తే బాహ్య పంచభూతాలు ఆకాశము, అగ్ని,భూమి,వాయువు మరియు నీరు. అంతర పంచభూతాలు ఎవరు అంటే మనలో ఉండే లివర్ అండ్ గాల్ బ్లేడర్ ఆకాశం లాగ పనిచేస్తూ కళ్ళు,మజిల్స్ అండ్ టెండన్స్ మీద ప్రభావం చూపిస్తాయి. లివర్ అండ్ గాల్ బ్లేడర్ లు పగలు రాత్రి లాగా పని చేస్తాయి. ఈ పగలు రాత్రి లాగా పనిచేసే ఈ లివర్ అండ్ గాల్బ్లాడర్ల మధ్య వ్యత్యాసం కళ్ళు,మజిల్స్ అండ్ టెండన్స్ లో వచ్చేటువంటి నొప్పులు, వీటి వ్యత్యాసం వల్ల ఏర్పడినట్లు మనం గమనించి,మనలో ఉన్న ప్రాణ శక్తి కేంద్రాలను మరియు ప్రాణశక్తి క్షేత్రాలను ఉపయోగించి లివర్ అండ్ గాల్బ్లాడర్ మధ్య వ్యత్యాసం తగ్గించడం ద్వారా ఆయా నొప్పులు గణనీయంగా తొర్తిగతిన తగ్గించుకోగలుగుతాము అంటే నొప్పులు మనలో ఆరోగ్య విధానములో వచ్చిన మార్పులకు సంకేతాలు అని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే కిడ్నీ యూరినరీ బ్లాడర్లు మన బాడీలో అంతర పంచభూతాలలో నీరు లాగా పని చేస్తాయి.వీటి మధ్య వచ్చే వ్యత్యాసం మూలంగా చెవులలో తల జుట్టు, బోన్స్ అండ్ మృదులాస్తి లో, రీప్రొడక్టువ్ సిస్టం లో నొప్పుల రూపములో ఈ కిడ్నీ యూరినరీ బ్లాడర్ మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని సిగ్నల్స్ గా మనకు తెలియజేస్తుంది. కిడ్నీ యూరినరీ బ్లాడర్ వేత్యాసన్ని ని సరి చేయటం ద్వారా ఆ పై విభాగాల్లో వచ్చిన నొప్పులను త్వరగా తగ్గించుకోవచ్చును. ఊపిరితితత్తులు , పెద్దప్రేగులు వ్యత్యాసము ముక్కు,స్కిన్ అండ్ బాడీ హెయిర్ లో తేడాగా కనిపిస్తాయి.ఊపర్తిత్తులు పెద్ద ప్రేగుల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ముక్కు,స్కిన్ బాడీ హెయిర్ వచ్చే సమస్యలను గడనీయంగా తగ్గించుకోవడానికి ఈ ప్రాణ శక్తి విధానం ఉపయోగపడుతుంది. అలాగే నోటిలో వచ్చే సమస్యలు, కాళ్లు చేతుల్లో వచ్చేటువంటి నొప్పులు కి పెద్ద కారణం ఉదరo అండ్ స్ప్లీన్ మధ్య వచ్చే వ్యత్యాసమే.వీటిని తగ్గించడానికి ఉదరము స్ప్లీన్ లను సమస్థితికి తేవడానికి మనం మనలోని ఈ ప్రాణ శక్తిని చైతన్యం పరచడం ద్వారా తేలిగ్గా తగ్గించవచ్చు. ఆఖరిది అగ్ని మూలకము లాగా మన బాడీలో హార్ట్,చిన్నప్రేగులు పనిచేస్తాయని వీటి మధ్య వచ్చే వ్యత్యాసము వలన నాలుక, తల వెంట్రుకలు,రక్త సరఫరా విభాగాలలో సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని తగ్గించడానికి హార్ట్ మరియు చిన్న ప్రేగుల వ్యత్యాసం మనలోని ప్రాణ శక్తి కేంద్రాలను,క్షేత్రాలను చైతన్య పరచడం ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్యం పొందే లాగా ఉన్న యోగాలోని ప్రాణమైయ కోశా విభాగానికి చెందిన ఈ విధానం భారతీయుల సొంతం. వేల సంవత్సరాలుగా వాడబడి అనేక సమస్యలను తగ్గించుకున్న, నిరూపించబడిన ఈ విధానాన్ని అందరూ వాడుకుని ఆరోగ్య వంతులు కావాల్సిందిగా డాక్టర్ మాకాల సత్యనారాయణ వ్యవస్థాపక చైర్మన్ యోగశక్తి సాధన సమితి విజయవాడ కోరుతున్నారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోవిడ్డ్లో జనం చనిపోతున్న తరుణంలో ఈ పంచభూతాలను సమస్థితికి తేవడం ద్వారా ఆరోగ్యంగా,ఆనందంగా పూర్ణాయూష్ లభిస్తుంది అని, తన ఫిట్నెస్ కి ఈ విధానం బాగా ఉపయోగపడుతున్నట్లు ప్రజలందరికీ తెలియజేశారు.ఇది భారతీయులకే కాదు యావత్ ప్రపంచం అనుసరించదగిన ఖర్చులేని, ఏ సమయము లో నైనా వాడుకో దగ్గ విధానం. కాబట్టి ఓ మంచి విధానాన్ని భారత ప్రజలకి అందించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఇచ్చిన ఈ ఆరోగ్య సంపద అందరూ ఉపయోగించుకోవాలని, ప్రతి ఇంటికి ఈ మెసేజ్ ని పంపించాల్సిన అవసరాన్ని, తెలిసిన మీరందరూ మిగతా వారికి తెలియ చెప్పాలని డాక్టర్ మాకాల సత్యనారాయణ విన్నపం గా తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం నందు ఆక్యూ తెరపిస్టులు పల్నాటి రాంప్రసాద్, నాగమణి, కరుణాకర్ వగైరా సేవలు అందించినారు.
Prajavartha Online Telugu News