ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, వసంత వెంకట కృష్ణ ప్రసాద్

-లింగాలపాడు లో పేరంటాలమ్మ తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
లింగాలపాడు గ్రామము నందు సోమవారం నాడు కూటమి నేతలు,ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తో కలిసి శ్రీ లక్ష్మీపేరంటాలమ్మ అమ్మవారి తిరునాళ్లలో పాల్గొని ఒంగోలు జాతి పశు బల ప్రదర్శన పందాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బసవన్నల (ఎద్దుల) పోటీలు గ్రామ నాగరికత పోకుండా అనాదిగా వస్తున్న ఆచారమన్నారు… ఈ పోటీలు చూడటానికి వచ్చేసిన యువకులు పెద్దలలో ఉత్సహం కనిపిస్తుందన్నారు..

సకల శుభాలకు, పాడిపంటలకు నెలవు శ్రీ లక్ష్మీపేరంటాలమ్మ అమ్మ వారు మంగళప్రదయైన ఆ తల్లి తనను కొలిచిన వారికి కొంగు బంగారమే నిలుస్తుంది అన్నారు అవుతుంది. . ఎద్దుల పందేల జోరుతో గ్రామ పెద్దలు, యువత చాలా ఆనందంగా కనిపిస్తున్నారు. బసవన్నల (ఎద్దుల) పోటీలకు చొరవ తీసుకోని ముందుకు వచ్చిన దేవాలయ పాలక వర్గ సభ్యులకు, సహకరించిన యాజమాన్యానికి ప్రతిఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలిపారు.. ఆ తల్లి చల్లని ఆశీస్సులు గ్రామస్తులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు,నందిగామ మండల పార్టీ ప్రెసిడెంట్ వీరంకి వీరస్వామి,నందిగామ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఏల్చూరి రాము,ఆలయ ధర్మకర్తల వంశపారింపర ధర్మకర్త చిరుమామిళ్ల వ వెంకటలక్ష్మి సాయిబాబా లతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *