మంగళవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం లో యోగాంధ్ర రాష్ట్ర స్థాయి కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 21వ తేదీ న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని “ఒకే ధరిత్రికి – ఒకే ఆరోగ్యానికి యోగా” (యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్) అనే నినాదంతో ప్రతిశాఖ,ప్రతి సంస్థ నందు ప్రతిష్ఠాత్మకంగా యోగా కార్యక్రమాలను నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులననుసరించి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వారి ఆదేశములతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారములో ది. 27.05.2025 మంగళవారం నాడు యోగాసన శిబిరాన్ని ఏర్పాటుచేస్తున్నట్టు కేంద్ర కారాగారము, రాజమహేంద్రవరం పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు. లోకసభ సభ్యురాలు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్,ఇతర శాఖల ఉన్నతాధికారులు, జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్టు తెలిపారు. యోగా శిక్షకులచే సుమారు 1300 మంది కారాగార ఆశ్రమవాసులు,అధికారులు, గార్డింగ్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది సహా సుమారు 1500 మందితో ఉదయం గం. 07.00ల నుండి 08.00 వరకు యోగా కార్యక్రమమును నిర్వహించనున్నట్లు తెలియ చేశారు. ఆదివారం జాయింట్ కలెక్టర్ యస్. చిన్న రాముడు, ఆర్డీవో ఆర్. కృష్ణా నాయక్, కారాగార పర్యవేక్షణాధికారి యస్. రాహుల్ ఆధ్వర్యంలో వేదికను, ఏర్పాట్లను పరిశీలించి, కార్యక్రమ నిర్వహణ గురించి దిశానిర్ధేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *