Breaking News

జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.30.05.2025 శుక్రవారం నాడు విజయవాడ లోని “కాకరపర్తి భావనారాయణ (కే.బీ.ఎన్ – KBN) కాలేజ్, విజయవాడ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా (JOB MELA)” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వై. సత్యబ్రహ్మం గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.

ఈ జాబ్ మేళా (JOB MELA) లో, 12 ప్రముఖ కంపెనీ వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు పదవ తరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్మీడియట్, ఎనీ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకి సుమారు రూ.12,000/- నుండి రూ.35,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, మే 30 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళా (JOB MELA) కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jobmela-naipunyam లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళా (JOB MELA) కు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9700092606 నెంబరు ను సంప్రదించాలని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *