జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…


-జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆదివారం పార్టీ అధినేత  పవన్ కల్యాణ్  జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. వజ్రోత్సవ వేళ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా రెపరెపలాడుతుంటే దేశభక్తి ఉప్పొంగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, పి.ఏ.సి. సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *