Breaking News

కోకో రైతులు నుంచి ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం

-కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్
-ఆర్డీవో రాణి సుస్మిత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోకో రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో  కోకో పండించే రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కోకో రైతులకు లావాదేవీలు నిర్వహించే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే దిశలో కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పని దినాలలో ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. వాస్తవ సాగు దారుల నుంచి కోకో దిగుబడులను ఈ నెలాఖరు లోపు పూర్తిగా సేకరించనున్నట్లు తెలిపారు. కోకో పంటనుజూన్ 30వ తేదీలోగా సేకరించాలని అధికారులకి జిల్లా కలెక్టర్ లక్ష్యం నిర్ధేశించినట్లు తెలిపారు. ఏదైనా సందేహాలు ఉంటే 7995367797 నెంబర్ కి కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని రైతులకి ఆర్డీవో రాణి సుస్మిత తెలియ చేశారు. కోకో రైతులకు కనీస మద్దతు ధర రూ.500 రావాలని ఈ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందు కోసం ఒక హార్టికల్చర్ అధికారి నీ కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *