Breaking News

ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ దినోత్సవ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం స్థానిక ఆర్యపురం ఏబి నాగేశ్వరరావు పార్కు లోని డే కేర్ భవనం లో సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల వేధింపు నివారణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా, ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ, ఎంతో అనుభవం గల సీనియర్ సిటిజన్స్ ఉన్న, ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం గా ఉందన్నారు. వారి అనుభవం నుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవాలని అన్నారు. అందరికీ న్యాయం అందించాలనే ధ్యేయంతో, ఏర్పాటు చేయబడిన న్యాయ సేవాధికార సంస్థ, వృద్ధులు, మహిళలు, 18 లోపు పిల్లలు, వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న పేద కుటుంబాలకు ఉచిత న్యాయం అందేలా సహాయ పడుతుందన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో గల తమ డి ఎల్ ఎస్ ఎ ఆఫీస్ లో వచ్చి లేదా టోల్ ఫ్రీ నెం. 15100కు ఫోన్ చేసి న్యాయ సేవలు పొందాలని సూచించారు. అలాగే, అర్హత గలవారికి న్యాయపరంగా వచ్చే పెన్షన్, పట్టాలు అందక పోవడం వంటి సమస్యల పరిష్కారానికి కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు.

ఇటీవలి కాలంలో కాలానుగుణంగా, కుటుంబ సంబంధ బాంధవ్యాలలో, వచ్చిన మార్పుల దృష్ట్యా, వృద్ధులు నిరాధారణ కు, వేధింపులకు గురవుతున్నారని, ఇది ఎంతో ఆవేదన చెందాల్సిన విషయం అన్నారు. నేటి ఆధునిక పరిస్థితుల దృష్ట్యా ఆర్ధిక పరమైన విషయాలలో, ప్రేమానురాగాల కతీతంగా, తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పని అన్నారు. వీలునామా కూడా, తమ తదనంతరం మాత్రమే, పిల్లలకు చెందేలా వ్రాయాలన్నారు. తల్లిదండ్రులు, పిల్లలకు, మంచి చెడుల గురించి, కుటుంబ సంబంధ బాంధ వ్యాలు, ప్రేమానురాగాల విలువలు, గురించి వంట బట్టేలా నేర్పించాలని శ్రీలక్ష్మి ఆకాంక్షించారు. ప్రస్తుతం ప్రేమ ఒక ప్రవాహం లా, పెద్దల నుండి పిల్లల వైపే ప్రవహిస్తుంది తప్ప .. . పిల్లల నుండి పెద్దల వైపుకు ప్రవహించ లేకపోతున్నదని ఆవేదన వ్యక్త పరిచారు. మానవ సంబంధాలు మెరుగు పరచడం ద్వారా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడం సాధ్యం అవుతుందని వ్యక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం లో సంఘం ప్రెసిడెంట్ అశోక్ కుమార్ జైన్, కార్యదర్శి లక్ష్మణ రావు, సభ్యులు కెకె సంజీవరావు,కె శంకర రావు, నరేంద్ర బాబు, సత్యనారాయణ,జి అప్పారావు, కోర్టు సిబ్బంది మహేష్, ఉదయ్, లీగల్ వాలంటీర్స్ వీర్రాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *