ఏపీడబ్ల్యూజేయు విజయవాడ అర్బన్ శాఖ కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయు) విజయవాడ అర్బన్ శాఖ నూతన కమిటీ కన్వీనర్ గా షేక్ నాగూర్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ప్రకటించారు.బుధవారం విజయవాడ గాంధీనగర్ బెజవాడ మీడియా సెంటర్ సమావేశ మందిరం లో జరిగిన యూనియన్ నగర కమిటీసమావేశంలో ఆయన ఈ ప్రకటన చేసారు.షేక్ నాగూర్ తోపాటు మరో 12 మంది తో అడహాక్ కమిటీని ప్రకటించారు. ఈసందర్భంగా మచ్చ రామలింగ రెడ్డి మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలనీ, జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటంచేస్తానని భరోసా ఇచ్చారు.అక్రిడేషన్ తో సంబంధంలేకుండా జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు, భీమసౌకర్యం కల్పించాలని, చిన్న పత్రికలకు విధిగా ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయాలని ఆయన డిమేండ్ చేసారు.యూట్యూబ్ ఛానల్స్ కు విధివిధానాలను ఖారారు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజేయు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సుబ్బారావు, సిటికాంగ్రేస్ మైనార్టీవిభాగం ఛైర్మెన్ షేక్ ఖాజామొహినుద్దీన్ , తదితరులు హాజరై నూతనంగా ఏర్పడిన నగర కమిటీని సత్కరించారు. నూతన కమిటీలో కో – కన్వీనర్ గా పీ.వీరభద్రా చారి, ఆర్గనైజర్ కన్వీనర్లుగా పోతిన శ్రీనివాసరావు ( వాసు ) టేకుమూడి అశోక్ కుమార్, సభ్యులు గా అబ్దుల్ ఖాదర్, కొండల రావు, సుకుమార్, శివ రమేష్, మల్లికార్జున రావు, షేక్ సిరాజుద్దీన్, షేక్ సిద్ధికి, కారే శ్రీనివాస రావు, షేక్ గాలిబ్ షాహిద్ లను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విజయవాడ అర్బన్ శాఖ కమిటీని ప్రకటించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *