కొత్త మాడ్యూల్ చట్టపరమైన సేవల విషయం పై అవగాహన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నల్సా పథకాలపై ప్రత్యేక దృష్టితో కొత్త మాడ్యూల్ చట్టపరమైన సేవల విషయం పై అవగాహన కల్పించడం కోసం శనివారం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగిందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు.

NALSA (జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ) & APSLSA (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందరికీ న్యాయం చేకూర్చడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. నల్సా పథకం, 2015 (ట్రాఫికింగ్ మరియు వాణిజ్య లైంగిక దోపిడీ బాధితులు), నల్సా (పేదరిక నిర్మూలన ప్రభావవంతమైన అమలు) పథకం, 2015 పై సమగ్ర అవగాహన కల్పించడం పై తూర్పు గోదావరి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, తూర్పు గోదావరి జిల్లా పరిపాలన యంత్రాంగం, పోలీసు , జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి నోడల్ అధికారి గా ఇతర శాఖల సమన్వయం తో ప్రత్యేక కార్యశాల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం లో నల్సా పథకాలపై ప్రత్యేక దృష్టితో కొత్త మాడ్యూల్ చట్టపరమైన సేవల కార్యక్రమం చేపట్టడం జరుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా ఎస్పీ డి నరసింహా కిషోర్, తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *