Breaking News

విద్యార్థినులు జాబ్ మార్కెట్ డిమాండ్ల కి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి…

-ప్రాజెక్ట్ మేనేజర్ ఐసిటి అకాడమీ దినేష్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థినులు జాబ్ మార్కెట్ డిమాండ్ల కి అనుగుణం గా నైపుణ్యాలు పెంచుకోవాలని ప్రాజెక్ట్ మేనేజర్ ఐసిటి అకాడమీ దినేష్ తెలిపారు. ఇన్ఫోసిస్ సి ఎస్ ఆర్ ఫినిషింగ్ స్కూల్ ఎంప్లాయబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవం లో విద్యార్థినులు డిగ్రీ తో పాటు అదనపు నైపుణ్యాలు లేకపోతే రాణించలేరని,డిగ్రీ తో పాటుగా జాబ్ మార్కెట్ డిమాండ్ల అనుగుణం గా వారుప్రొఫెషనల్ స్కిల్స్ ను మెరుగు పరచుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలంటే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రొఫెషనల్ గా నైపుణ్యాలు ఉండాలని ఈ ప్రాజెక్ట్ ను డిగ్రీ విద్యార్ధినుల కోసం ఐ సి టి అకాడమీ మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థలతో కలిసి ప్రారంభించామని కరెస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లీన క్వడ్రస్ తెలిపారు. ఇన్ఫోసిస్ ఫినిషింగ్ స్కూల్ ఎంప్లాయబిలిటీ ఐ సి టి. ప్రాజెక్ట్ మేనేజర్ దినేష్ మాట్లాడుతూ100 పని గంటలు వచ్చే విధముగా ఈ కోర్సు డిజైన్ చేయించామని, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ థింకింగ్, రీజనింగ్ క్రిటికల్ థింకింథింకింగ్ మెంటల్ ఎబిలిటీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ వంటి అంశాలు నేర్పించటం దాని తో పాటు జాబ్ మార్కెట్ లో పోటీ ను తట్టుకుని తమ కాళ్లపై తాము నిలబడేలా మంచి పోటీ పరీక్ష కు తగిన విధం గా శిక్షణ జరుగుతుందని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఉష కుమారి, కామర్స్ విభాగాధిపతి పూజిత మరియు ఇతర అధ్యాపకులు పద్మజ 65 మంది కామర్స్ , బి బి ఏ విద్యార్థి నులు పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి సర్టిఫి కేట్ ఇవ్వబడుతుందని ఇది వారి ప్రొఫెషనల్ గ్రోత్ కి ఉపయోగపడుతుందని పూజిత కామర్స్ విభాగాధిపతి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *