Breaking News

అధిష్టానం నిర్ణయమే ఫైనల్

-పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోటీపై ఇన్చార్జి మంత్రి సవిత

కడప/పులివెందుల, నేటి పత్రిక ప్రజావార్త :
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంపై పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో గురువారం ఉదయం నియోజక వర్గ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఇన్చార్జి మంత్రి సవిత పాల్గొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదంలో జెడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి మృతిచెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. ఉప ఎన్నికల్లో పోటీపై టీడీపీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశానుసారం నడుచుకుంటామని స్పష్టంచేశారు. ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిని గాని, ఆయన తమ్ముడిని గాని బరిలో నిలపాలని నియోజ వర్గ నేతలు, కార్యకర్తలు నిర్ణయించారన్నారు. ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళతామని, సీఎం చంద్రబాబునాయుడు తీసుకునే నిర్ణయం మేరకు పోటీపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. శుక్రవారమే నామినేషన్లకు చివరి రోజని, నేటి సాయంత్రంలోగా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇన్చార్జి మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పాల్గొన్నారు. అంతకుముందు పులివెందులకు చేరుకున్న ఇన్చార్జి మంత్రి సవితకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పట్టణాలే గ్రోత్ ఇంజిన్లు

-వీకెండ్ ఎకానమీ పెంచేలా చర్యలు చేపట్టాలి -అర్బన్ ప్రాస్పెరిటీ విభాగంగా పట్టణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దాలి -పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *