పదవులను బాధ్యతగా భావించాలి… : ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేశ్వర రావు తో పాటు ఏపీ లో నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అభినందనలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని కోరారు. ఏపీలో నామినేటెడ్ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 31కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ గా కాసునూరి నాగుల్ మీరా, ఆంధ్రప్రదేశ్ నగరాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా మరుపిళ్ల తిరుమలేశ్వర రావు , ఏపీ నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఎరుబోతు రామనారాయణ రావు నియమితులయ్యారు. వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *