-కూటమి నేతలతో కలిసి అందజేసిన ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ గౌరవాధ్యక్షులు, జనసేన నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు , పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ .ఓ. సీ ను మంగళవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ ఆర్యవైశ్య మహాసభ మాజీ గౌరవాధ్యక్షులు, జనసేన నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమినేతలతో కలిసి అందజేశారు. 47 వ డివిజన్, కుండల మార్కెట్ కు చెందిన పోతిన భవాని (25) తక్కువ బరువుతో ఉన్న శిశువుకు జన్మనివ్వడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. శిశువుకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ ఎల్ ఓ సీ కొరకు ఎన్డీఏ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. మంజూరైన రూ 15 లక్షల 61 వేల ఎల్ ఓ సీ ను చిన్నారి తండ్రి కి అందజేశారు. త్వరితగతిన ఎల్.ఓ. సీ ను మంజూరు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య , జనసేన 41 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష,41 వ డివిజన్ ప్రెసిడెంట్ ప్రత్తి నాగేశ్వరరావు, బీజేపీ నేత వేరుకొండ ఉమాకాంత్ , మంగళపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News