Breaking News

శ్రీశ్రీశ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి ఆరాధన మహోత్సవములు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ సద్గురు రాఘవేంద్ర స్వామి బృందావన్ సేవా సమితి ఆధ్వర్యంలో, స్థానిక బ్రాహ్మణ వీధిలో శ్రీశ్రీశ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 354 వ ఆరాధన మహోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ రాఘవేంద్ర స్వామి, బృందావన్ సేవా సమితి సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నందిపాటి శంకరరావు, కోశాధికారి కేదారిశెట్టి గుప్త, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, విశ్వ హిందూ పరిషత్ విజయవాడ జిల్లా ఉపాధ్యక్షులు పొట్టి శ్రీహరి,జిల్లా సహ కార్యదర్శి కొంపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *