తక్కువ కాలంలో పంట దిగుబడి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించండి…

-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు.
-వరి పంటలపై అధికారులతో సమీక్షించిన మంత్రి.

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
తక్కువ కాలంలో పంట దిగుబడి వంగడాలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆదేశించారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ తోపాటు అగ్రికల్చరల్ ఏడి, అగ్రికల్చరల్ అధికారులు తో ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రైతులు యదలు చల్లేందుకు మొగ్గుచూపేలా చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా రైతులకు తక్కువ సమయంలో పంట దిగుబడి వచ్చే విత్తనాలు ఉపయోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అంతే కాకుండా సాగు విషయాలపై ఎప్పటికప్పుడు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరో వారం రోజుల పాటు పంట నమోదు వెబ్ సైట్ ఆన్ ఉంచుతుందని ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలని కోరారు. ప్రతి సచివాలయ పరిదిలో గ్రామీణ వ్యవసాయ అధికారి ఉంటారని వారు ఆ సచివాలయ పరిధిలో క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేబకాకుండా రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా సచివాలయ వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారి తోపాటు అగ్రికల్చరల్ ఏడి కూడా అందుబాటులో ఉంటారని రైతు సమస్యలపై వారిని సంప్రదించాలని అన్నారు. ఇంకా యదలు వేయని రైతులు తప్పకుండా యదలు చల్లాలని అన్నారు. ప్రతి రైతు పంట నమోదు కార్యక్రమం చేపట్టడం ద్వారా పంటలు పండకపోయినా ప్రభుత్వం అందించే ఇన్సూరెన్స్ అందే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి రైతు మేలుకోరి అధికారులు పనిచేయాలని అధికారులను మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు సూచించారు. కార్యక్రమంలో ఏ.డీ మధుబాబు, ఏ.ఓ లు నాగరాజు, పొలారావు, కిరణ్ వాణి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *