Breaking News

శ్రీకృష్ణుడు లో సర్వ కళలు ఉన్నాయి కాబట్టే సర్వాంతర్యామి అయ్యాడు…

-ప్రతి మనిషి కృష్ణ తత్వం కోసం తెలుసుకోవాలి…
-కాశీబుగ్గలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో మంత్రి
-రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు

పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
పెదవులపై వేణువు.. మెడపై పసుపు.. తలపై నెమలి ఫించంలో శ్రీ కృష్ణడిని చూస్తుంటే సర్వ కళలకు ఆయనలోనే ఉన్నాయి కాబట్టే ఆయన సర్వాంతర్యామి అయ్యారని అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం కాశీబుగ్గ చేపల మార్కెట్ దగ్గరలో కండ్ర సామాజిక వర్గం వారు ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణాష్టమి మూడు రోజుల వేడుకల్లో భాగంగా ఆయన రెండవ రోజు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలమేఘ శ్యాముడు ఈ భూమిపై ఉన్నంత కాలం మానవ సంక్షేమం కోసమే బతికాడని అన్నారు. అంతే కాకుండా కోరివచ్చిన ప్రతి ఒక్కరి కోరికను తీర్చాడని తెలిపారు. విష్ణువు 8 వ అవతారంగా వచ్చిన శ్రీ కృష్ణుడు ప్రపంచంలో అన్ని కష్టాలను ఓడించే భగవద్గీత అనే జ్ఞానాన్ని మనకు అందించాడని చెప్పారు. చిన్నతనంలో గోకులంలో చేసిన ఆయన లీలల ద్వారా ఆందరిని ఆకర్షించారని. శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం అష్టమి తిథిన రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించిన శ్రీ కృష్ణుడికి ఇద్దరు తల్లులు ఉన్నారని అందరికి తెలుసు.కానీ కన్నయ్యకు ఐదుగురు తల్లులు ఉన్నారనే విషయం మీకు తెలుసా అని అందరికి అడిగారు. ఒక్కసారిగా ప్రాంగణం మొత్తం ఆలోచనలో పడ్డారు. అదేంటి దేవకి, యశోద కదా అని అనుకుంటున్నారా కాదు వీరిద్దరు కాకుండా మరో ముగ్గురును కన్నయ్య మాతృ సమానులుగా కొలిచేవాడని తెలిపారు. వారే రోహిణి, సుముఖిదేవి,పూతన వీరిని కూడా శ్రీ కృష్ణుడు తల్లులు గానే కొలిచేవాడని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకృష్ణుడు రాజు కొడుకే అయినా ఒక పశువుల కాపరిగానే గోకులంలో పెరిగాడు. భాగవతంలో కృష్ణ తత్వం కోసం తెలుసుకోవచ్చు. మనం శ్రీ కృష్ణుడు మన ప్రక్కనే ఉన్నాడని నమ్మి ఆయన్ని నిత్యం మనం కొలుస్తుంటే అన్ని సమస్యలకి దారులు దొరులుతాయి. ఇది తెలియక మనం మనోహరమైన శ్రీ కృష్ణుడి రూపాన్ని మన మనసు నుండి తొలగించి ద్వేషం, అసూయ,కోపం ఇలా మనసు నిండా నింపు కోవడంతో మనిషి మనసు నుండి దైవం తొలగి పోతుందని అప్పుడే ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయని అందుకే భగవంతుడు మన ప్రక్కనే ఉన్నాడని నమ్మమని చెప్పేదే శ్రీ కృష్ణ తత్వం అని మంత్రి డాక్టర్ అప్పలరాజు అన్నారు. భగవంతుని ఆశీస్సులు అందుకుని అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పూజా కమిటీ సభ్యులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Check Also

మాకు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగుల గృహ నిర్మాణ సంఘం పేరుతో ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *