Breaking News

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు… : మంత్రి పేర్ని నాని

-మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి గురజాడ వద్ద రూ. కోటి రూపాయలతో అండర్ పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం…
-రూ.31 కోట్లతో పాములలంక బ్రిడ్జి నిర్మాణ పనలు త్వరలో చేపడతాం…
-రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)

పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులపై ప్రమాదాలు నియంత్రణకు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) నాని అన్నారు. స్థానిక ఆర్అండ్ బి అతిథి గృహంలో శనివారం జాతీయ రహదారి భద్రత అంశంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి నాని మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలనే అంశం పై అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పేర్ని నాని, మంత్రి కొడాలి నాని, జిల్లా కలెక్టరు జె. నివాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారిన మచిలీపట్నం — విజయవాడ ప్రధాన జాతీయ రహదారిపై పామర్రు నియోజకవర్గ పరిధిలోని గురజాడ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి దాదాపు కోటి రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సంబంధిత శాఖ అధికారులకు పంపుతున్నట్లు చెప్పారు. ఈ రహదారి ప్రాంతంలో ఇప్పటి వరకు 13 ప్రమాదాలు జరిగిన్టలుగా పోలీసు రికార్డులు నిర్థారించాయన్నారు. జాతీయ రహదారి పై ప్రమాదాలు నియంత్రించే విదంగా తక్షణమే సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ కోరారన్నారు. శాసనసభ్యలు సూచనల మేరకు జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో అక్కడ పర్యటించడం జరిగింన్నారు. ప్రమాదాలను తాత్కాలికంగా నిరోధించేందుకు ప్రస్తుతమున్న రహదారికి డైవర్షన్ 40నుంచి 50 మీటర్ల దూరం లో ఏర్పాటు చేసి రహదారి పై వచ్చే వెళ్లే వాహనాలకు పాదచారులు, ఆటోలు, మోటారు సైకిళ్లు కనపడే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వేమరపాటుగా జరిగే మరణాలును నియంత్రించేందుకు తాత్కాలిక మరియు శాశ్విత పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తోట్ల వల్లూరు మండలం లోని పాములలంక బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన 13 సెట్లు భూసేకరణ త్వరితగతిన సహకరించవలసిందిగా ఆదేశించడం జరిగింది అన్నారు. ఆ వంతెన నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు చొరవతో రూ. 31 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. త్వరలో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ జాయింట్ కలెక్టర్ కె మాధవి లత, ఆర్డీవో ఖాజావలి, ఐదు మండలాలకు చెందిన అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *