తేనెటీగల పెంపకం 10 రోజుల నైపుణ్య అభివృద్ధి శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల  కమిషన్ రాష్ట్ర కార్యాలయం, విజయవాడ, రాష్ట్ర సంచాలకులు డాక్టర్║ ఎస్. గ్రిప్, ఆధ్వర్యంలో గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద తేనెటీగల పెంపకం 10 రోజుల నైపుణ్య అభివృద్ధి శిక్షణను బోబ్బర లంక గ్రామం, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లా నందు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులు 10.10.2025 తేదీ నుండి 19.10.2025 తేదీ వరకు నిర్వహించుచున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో 20 మంది షెడ్యూల్ కులముల వారు శిక్షణ పొందుటకు ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఈ శిక్షణ ప్రారంభ సమయంలో 40 మంది వరకు పాల్గొనటం జరిగినది.

ఈ కార్యక్రమంలో సీ.హెచ్. లీలా వసుంధర, బోబ్బర లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి, Panchayat Secretary), ఆర్. ఎల్. ఎన్. మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్-II, SO, KVIC, విజయవాడ, ఎల్. బసవ శంకర్ రావు, Vice President, బోబ్బర లంక గ్రామ పంచాయతీ, టి.వి.రావు, ఎగ్జిక్యూటివ్, (పదవీ విరమణ చేసిన), ఎస్. టి. పి. ఎ. వి రమేష్ కుమార్, మాస్టర్ ట్రైనర్, పాల్గొన్నారు.

తేనెటీగల పాత్ర మరియు ప్రాముఖ్యత , తేనెటీగల రక్షణ మరియు వివిధ పథకాల క్రింద ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అందిస్తున్న సాంకేతిక మరియు ఆర్థిక సహాయం గురించి వివరించుట జరిగినది.
సీ.హెచ్. లీలా వసుంధర, బోబ్బర లంక గ్రామ పంచాయతీ కార్యదర్శి, మాట్లాడుతూ, ఈ పది రోజుల శిక్షణా  తరగతులు వినియోగం చేసుకుని ఆధునిక పద్ధతులు ద్వారా ఉత్పత్తి ఏ విధంగా పెంచుకోవాలి తెలుసుకోని తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

టి. వి. రావు, SBEC, KVIC, ఎగ్జిక్యూటివ్, (పదవీ విరమణ చేసిన),శిక్షణ సౌకర్యాలు మరియు తేనె వెలికితీత  మొదలగు వాటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినారు. మానవుల ప్రయోజనాల కోసం ప్రకృతిలో తేనెటీగల ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా తేనె ఉత్పత్తి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.

ఆర్. ఎల్. ఎన్. మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్-II, SO, KVIC, విజయవాడ, మాట్లాడుతూ KVIC గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద సాంప్రదాయ గ్రామీణ చేతివృత్తుల వారిని గుర్తించి  వివిధ రకాలైన చేతివృత్తులలో  ఆదాయాన్ని పెంచుటకు మరియు ఆధునిక పద్ధతులను ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం జరుగుచున్నది. గ్రామోద్యోగ్ వికాస్ యోజన కార్యక్రమం వల్ల, చేతివృత్తులవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు ఎక్కువ ఆదాయం మరియు తక్కువ శ్రమను పొందడం కొరకు మెరుగైన టూల్స్/ఎక్విప్ మెంట్ పై పనిచేయుట ద్వారా ప్రయోజనం పొందుతారు. అదేవిధంగా శిక్షణ పొందిన వారందరికీ మెరుగైన టూల్స్ ఎక్విప్మెంట్ కూడా అందజేయడం జరుగుచున్నదని తెలియపరిచినారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తేనెటీగల పెంపకం ప్రాథమిక సూత్రాలు, అధునాతన పద్ధతులు, తేనె వెలికితీత మరియు తెగులు నిర్వహణ వంటి వాటి పై శిక్షణను ఇవ్వడము జరుగుతుంది తెలియపరచారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు “స్వదేశీ ప్రతిజ్ఞ” లో పాల్గోనుట జరిగినది. ఆర్. ఎల్. ఎన్. మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్-II, SO, KVIC వందన సమర్పణ తో సమావేశం ముగిసినది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *