విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దశల వారీగా చేస్తున్న ఈ సమ్మెలో భాగంగా వివిధ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హాస్పిటల్ అసోసియేషన్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్,108,104,102 అసోసియేషన్స్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అసోసియేషన్,ఏపీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్, ప్రజారోగ్య వేదిక, కెవిపిఎస్, ఏపీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ హెల్త్ సూపర్వైజర్స్ అసోసియేషన్, ఎన్ హెచ్ ఎం జేఏసీ, ఏపీ గవర్నమెంట్ స్టాఫ్ నర్స్ అసోసియేషన్, ఏపీ పీఎం సేవ తదితర సంస్థలు పాల్గొని బేషరతుగా తమ మద్దతును తెలియజేస్తూ సోమవారం నుండి పీహెచ్సీలు వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సిబ్బంది అందరూ పి హెచ్ సి వైద్యుల పోరాటానికి సంఘీభావం తెలుపుతామని తీర్మానం చేశారు. రానున్న రోజుల్లో లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ తో పాటు ప్రభుత్వం పి హెచ్ సి వైద్యుల సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే సమ్మెకి మద్దతుగా తమ కార్యాచరణ ప్రకటిస్తామని తీర్మానం చేశారు.
వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిషోర్ మాట్లాడుతూ మా ఈ పోరాటం మా ప్రాథమిక హక్కులు సాధించేవరకు కొనసాగిస్తామని, ప్రభుత్వం గతంలో ఇచ్చినహామీ నిలబెట్టుకోవాలని కోరుతున్నామన్నారు.
జాయింట్ సెక్రటరీ డా గోపీనాథ్ మాట్లాడుతూ తమ పోరాటం ప్రభుత్వ పాలసీ పైన మాత్రమే గానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని తమకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాయక్ తీర్మానాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రవేశపెట్టాగా సభ్యులందరూ దీనిని ఆమోదించారు.
తమ ఈ సమస్యలు ప్రభుత్వం తీర్చలేనివి కాదని, ప్రభుత్వం తలుచుకుంటే క్షణాల్లో పరిష్కరించే సమస్యలేనని, పైగా ప్రభుత్వమే మా సమస్యలు న్యాయమైనవని ఒప్పుకున్నందున ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన పరిష్కారం చూపించాలని ఉపాధ్యక్షులు డాక్టర్ రాహుల్ అన్నారు
తమ ఈ పోరాటం రాజకీయాలకు అతీతంగా, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా కేవలం తాము ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించే ఒక మార్గంగా మాత్రమే నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, తాము ఎల్లప్పుడూ ప్రభుత్వంతో సహృద్భావ వాతావరణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల ఆరోగ్య దృష్ట్యా పని చేసేందుకు కృషి చేస్తున్నామని, పెద్ద మనసుతో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కోశాధికారి డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
Prajavartha Online Telugu News