-“శభాష్ క్రాంతి!” అంటూ ప్రశంసించిన ప్రధాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆక్వా రైతు ప్రతినిధిగా టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ ప్రధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి పెంపుకి చేస్తున్న సేవలను వివరించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (PMMSY), ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (FIDF) పథకాల ద్వారా మత్స్యకారులకు, ఆక్వా రైతులకు అందుతున్న మద్దతు గురించి వివరించారు.
గద్దె క్రాంతికుమార్ ప్రధాని మోడీతో మాట్లాడుతూ “ఆక్వా రంగంలో అవసరమైన ఐఓటీస్ పరికరాలకు, ఆధునిక టెక్నికల్ మెషినరీకి అవసరమైన పెట్టుబడులపై సబ్సిడీని PMMSYలో చేర్చితే రైతులకు మరింత మేలు జరుగుతుంది” అని సూచించారు. అలాగే FIDF పథకం ద్వారా తక్కువ వడ్డీ రుణాలు అందించడం వలన అనేక మంది ఆక్వా రైతులు తమ కార్యకలాపాలను విస్తరించగలిగారని, దీని ద్వారా రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. గద్దె క్రాంతికుమార్ వివరణను శ్రద్ధగా విన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ఆక్వా రంగాన్ని ప్రశంసిస్తూ ఆయన భుజంపై చేయి వేసి “శభాష్ క్రాంతి!” అని అభినందించారు. “నాకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంతో ఇష్టం” అని ప్రధాని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ “ప్రధాని గారి ప్రోత్సాహం నాకు ప్రేరణనిచ్చింది. కేంద్ర పథకాలను సమర్థంగా ఉపయోగించి ఆక్వా రైతుల అభివృద్ధికి మరింత కృషి చేస్తా” అని తెలిపారు.
అలాగే 100 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 16 మత్స్యకార ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడం ద్వారా ఆక్వా రంగానికి నూతన ఊపునిచ్చినట్లయింది అని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News