Breaking News

13 ఔట్సోర్సింగ్ కోచ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థలో 13 ఔట్సోర్సింగ్ కోచ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులకు నియామక పత్రాలు ఈ రోజు విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా ప్రతిభను మరింత అభివృద్ధి పరిచేందుకు శాప్ నిరంతరం కృషి చేస్తోందని, కొత్తగా నియమించబడిన కోచ్లు యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే దశగా ఉత్తమ సేవలు అందించాలన్నారు. ఆర్చరీ, బాడ్మింటన్, కానోయింగ్ కయాకింగ్, క్రికెట్, ఖో-ఖో, టెన్నిస్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పారాస్పోర్ట్స్ (అథ్లెటిక్స్) మరియు యోగా విభాగాలకు చెందిన కోచ్ లు రాష్ట్రంలోని వివిధ జిల్లాలో సేవలందిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ అదికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *