విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2, 5 డివిజన్ల కి చెందిన ఇద్దరికీ వైద్య చికిత్స నిమిత్తం 1 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా శుక్రవారం గుణదల లోని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మలకుమారి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబడిపూడి నిర్మలకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షోభంలో కూడా నిరుపేదల సంక్షేమం కొరకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు అని, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపిందెనుకు,ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ అవినాష్ కృషి చేస్తున్నారు అని, వారిరువురి నాయకత్వం లో పని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోంగా రాజకమల్, చినబాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News