మహిళా సంక్షేమనికి ప్రభుత్వం పెద్దపీట… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళ సంక్షేమనికి పెద్దపీట వేస్తూ పథకాల అమలు జరుగుతుంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం రాణిగారితోట సిమెంట్ గౌడౌన్ వద్ద 17,18 డివిజిన్ల రెండవ విడత ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆయా డివిజిన్ల పరిధిలో 368 గ్రూపులకు మంజూరు అయిన 2కోట్ల 88 లక్షల రూపాయల చెక్కు నమూనాను లబ్ది దారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్థిక సంక్షోభంలో కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పధకాల అమలు చేస్తున్నారని,మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితిలో ఉండాలని ప్రతి పధకంలో వారికి లబ్ది చేకూర్చడమే కాకుండా రాజకీయంగా పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు. ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇచ్చి వారిని యజమానులను చేస్తుంటే ఓర్వలేక వారి రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్షాలు వ్యవస్థ లను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన పేదవారి సొంతింటి కలను ఈ ప్రభుత్వం సాకారం చేస్తుంది అని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత, 18వ డివిజన్ కార్పొరేటర్ & ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, 17వ డివిజన్ కార్పొరేటర్ & స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, 22వ డివిజన్ కార్పొరేటర్ కొండా రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వర రెడ్డి మరియు రెండు డివిజన్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *