Breaking News

వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీల ఏర్పాటు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 64 వార్డులలో వీధి కుక్కల సమస్యల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని కమిషనర్ ధ్యానచంద్ర శనివారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల సమస్యల నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి వార్డుకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఒక కమిటీలో నలుగురు సభ్యులు ఉంటారని, శానిటరీ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన జంతు ప్రేమికులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నగర పౌరులు, అలా ఈ నలుగురితో ఒక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి వార్డులో నలుగురితో కూడిన ఈ కమిటీ వీధి కుక్కల సమస్యల నియంత్రణ కు పని చేస్తుందని అన్నారు. ఆ వార్డులో వీధి కుక్కలకు సంబంధించిన సమస్యలను ఈ కమిటీలు పరిష్కరించేటట్టు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నగర ప్రజలు వీధి కుక్కల సంబంధిత ఎటువంటి సమస్యలైనా ఈ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావాలని , ఈ కమిటీ సభ్యులు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటారని కమిషనర్ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వల్ప వర్షానికే జలమయం.. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం

-​రాజారాజేశ్వరి పేట నుంచి బుడుమేరు వరకు నీట మునిగిన రోడ్ల పరిశీలన -​గత రెండేళ్లుగా నగరానికి ఒక్క రూపాయి నిధులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *