-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు కావాలి…
-ఆర్బీకేల ద్వారా ఖరీఫ్ ధాన్యం కొనుగోలు…
జి. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్ చెప్పారు. బుధవారం జి.కొండూరులో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలసి రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ – క్రాప్ లో తాము పండించే పంట వివరాలు తప్పక నమోదు చేసుకోవాలన్నారు. దీని వల్ల తుఫానులు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట దెబ్బతిన్నపుడు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు క్రాఫ్ ఇన్సూరెన్, ఇన్ పుట్ సబ్సిడి వంటి పరిహారం పొందే వీలుకల్గుతుందన్నారు. రైతు స్పందన ద్వారా రైతుల సమస్యల పై వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు జిల్లాలో ప్రతి నెలలో మొదటి, మూడవ బుధవారం రైతు స్పందన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ రైతు స్పందనా కార్యక్రమానికి వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ,పశుసంవర్థక శాఖ వైద్యులు, మత్స్యశాఖ,విద్యుత్ తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News