-కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ తోకల రామకృష్ణ
కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 18 గురువారం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా కైకలూరులోని సిఎన్ఆర్ గార్డెన్ నందు కైకలూరు నియోజకవర్గ బీసీవై పార్టీ కన్వీనర్ తోకల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదటగా కేకులు కట్ చేసి ప్రారంభోత్సవ వేడుకలను ప్రారంభించారు. బోడె రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అనేక సామాజిక కార్యక్రమాలను తోకల రామకృష్ణ నిర్వహించారు. అందులో భాగంగా వృద్ధులకు వితంతువులకు చీరలు సుమారు 250 మందికి పంపిణీ చేశారు. అదేవిధంగా పుట్టినరోజు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రుచికరమైన భోజనాన్ని అందించి అన్నదానం చేశారు. బీసీవై పార్టీ విధి విధానాలు నిబద్ధత కు ఆకర్షితులైన యువత సుమారు 30 నుండి 40 మంది రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా బీసీవై పార్టీలో కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ తోకల రామకృష్ణ ఆధ్వర్యంలో చేరారు. వీరిని తోకల రామకృష్ణ బీసీవై పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గ కన్వీనర్ తోకల రామకృష్ణ మాట్లాడుతూ బోడే రామచంద్ర యాదవ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా పుంగనూరులో మెగాజాబ్ మేళా నిర్వహించారన్నారు. దీని ద్వారా సుమారు 22,000 మందికి ఉద్యోగ అవకాశాలకు కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో సుమారు 120 కంపెనీలు పాల్గొని నిరుద్యోగులైన యువతకి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తున్నాయన్నారు. అదేవిధంగా పుంగనూరు మరియు మంగళగిరి బీసీవై పార్టీ సెంట్రల్ ఆఫీస్ నందు మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి బీసీవై పార్టీ యువత ద్వారా రక్తాన్ని సేకరించి అవసరమైన రోగులకు అందించి వారి ప్రాణాలను నిలపడంలో బీసీవై కార్యకర్తలు యువత ఎప్పుడు ముందుంటారని తెలియజేశారు. బీసీవై పార్టీ అభివృద్ధిలో తాను ఎప్పుడు ముందుండి సైనికుడిలా సేవ చేయడానికి సిద్ధంగా తమ నియోజకవర్గ ప్రజలతో ఎప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ నాగమణి యాదవ్, యూత్ కన్వీనర్ ఏలూరు జిల్లా పాపారావు, యూత్ కన్వీనర్ కైకలూరు మీగడ రాము, రైతు విభాగం అధ్యక్షులు అనగాని రాంప్రసాద్, బీసీవై పార్టీ నాయకులు పాముల ఏసుపాదం, బీసీవై పార్టీ నాయకులు జల్లి ఫణీంద్ర కుమార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News