ఈ నెల 27న ఎంఎస్ఎంఈ మ‌హోత్స‌వ్‌!

– అంత‌ర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్స‌వం రోజున మెగా మేళా
– యువ మేధ‌కు అనుభ‌వం తోడైతే అద్భుతాలే
– ఔత్సాహికులు, పారిశ్రామిక‌వేత్త‌లు అంద‌రూ ఒకే వేదిక‌పైకి
– మీడియా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27వ తేదీన అంత‌ర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్స‌వం సంద‌ర్భంగా ఎనికేపాడులోని ఆర్‌టీఐహెచ్ లో ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌-2026ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ఆర్‌టీఐహెచ్‌-విజ‌య‌వాడ సీఈవో జి.కృష్ణ‌న్‌, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండ‌స్ట్రీస్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ డి.దుర్గాప్ర‌సాద్‌, జేఆర్‌డీ టాటా ఐలా ఛైర్మ‌న్ టి.వినోద్‌బాబు, ప్ర‌కాస స్పెక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ టి.పార్థ‌సార‌థి, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి ఎం.మ‌ధుతో క‌లిసి మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) రాష్ట్ర‌, దేశ ఆర్థికాభివృద్ధికి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయ‌ని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో యువ మేధస్సును ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న దిశ‌గా న‌డిపించేందుకు.. ఆస‌క్తి ఉన్న యువ‌త‌కు, అనుభ‌వమున్న పారిశ్రామిక‌వేత్త‌లు మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచేందుకు ఈ మేళా మంచి వేదిక‌గా నిలుస్తుంద‌న్నారు. యువ‌త‌ను చైత‌న్య‌ప‌రిచేందుకు.. వారు ఉన్న‌త పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎదిగేలా చేయిప‌ట్టి న‌డిపించేందుకు ఈ మేళా ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లు త‌మ ఆలోచ‌న‌లకు కార్య‌రూప‌మిచ్చి ఉత్ప‌త్తుల‌ను స్టాళ్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌నం ఇచ్చే గోరంత చేయూత కొండంత బ‌ల‌మిస్తుంద‌న్నారు. ఈ మేళాను యువ‌త స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. జిల్లాలో ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్నామ‌ని, ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల‌ను అభివృద్ధి చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు. ఈ మేళాలో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వాములై, యువ‌త‌ను, వారి కొత్త ఆలోచ‌ల‌ను ప్రోత్స‌హించి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పారిశ్రామికవేత్తలుగా పౌల్ట్రీ రైతులు

-వాతావరణ అనుకూల పౌల్ట్రీ షెడ్ల ఏర్పాటుకు కార్యాచరణ -ఐబీ గ్రూప్‌తో కలిసి కుప్పంలో పైలట్ ప్రాజెక్టు -రైతులు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *