Breaking News

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థులు సాధించిన విజయం

-కేంద్ర విద్యాశాఖా మంత్రి పదవి బిజెపికి కాకుండా టిడిపి, జెడియులకు ఇవ్వాలి
-27న దేశ వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర విద్యా శాఖా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం భారతదేశ వ్యాపితంగా ఉవ్వెత్తున జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థుల ఘన విజయంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అభివర్ణించారు.
ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ పరీక్షలలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 49 రోజులపాటు విద్యార్థులు, యువకులు, వారి తల్లిదండ్రులు పోరాటంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దే కాకుండా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత రోడ్డెక్కి ఆందోళన చేపట్టిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖా మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. ఇది విద్యార్థులు సాధించిన ఘన విజయం. ఈ మహోద్యమంలో పాల్గొన్న విద్యార్థి లోకానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కేంద్ర విద్యాశాఖామంత్రిగా మరో బిజెపి నాయకుడైన ప్రహ్లాద్ జోషిని తీసుకురావడం సమంజసం కాదు. భారతదేశ రాజ్యాంగం, లౌకికవాదం విద్యారంగంలో చోటుచేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర విద్యా శాఖా మంత్రి పదవిని బిజెపికి చెందిన వారికి కాకుండా ఎన్‌డిఎలో ఉన్న లౌకిక పార్టీలైన తెలుగుదేశం లేదా జెడియులకు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీని డిమాండ్ చేస్తున్నాం.
అదే విధంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీతోసహా పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గతం నుండీ కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌టిఎను రద్దు చేయాలని, ఆయా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని కోరుతున్నాయి. కేంద్రంలో నరేంద్రమోడీ ఆధ్వర్యంలో బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా విద్యారంగాన్ని వ్యాపార ధృక్పథంతో చూడడంతోపాటు, మతపరమైన రంగు పులుమడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోడీ సర్కార్ 2020లో ప్రవేశపెట్టిన విద్యార్థి వ్యతిరేక కమÖ్యనల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
విద్యార్థిలోకం ఒకవైపు విజయోత్సవాలు జరుపుకుంటూనే, మరోవైపు ఎన్‌టిఎను రద్దు చేయాలని, ఎనఈపిని ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ భారత కమÖ్యనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో రేపు (జూలై 27)న అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్దఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని నిరసనలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. కమÖ్యనల్ ఎజెండాతో పార్లమెంటు సమావేశాలలో అనేక బిల్లులు తీసుకొచ్చేందుకు మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తోంది. అప్రజాస్వామికంగా బిల్లులు ఆమోదింపచేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలను చీల్చి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తమకు అనుకూలంగా మెజార్టీ తెచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ అప్రమత్తంగా ఉండి, రాబోయే రోజుల్లో కూడా పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. 49 రోజులపాటు ఉవ్వెత్తున సాగిన ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *