Breaking News

మెగా డీఎస్సీపై ఆరోపణలు కాదు రుజువులు చూపించు

-జగన్ పై మంత్రి సవిత ఫైర్
-చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఎద్దేవా
-కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న వైసీపీ
-బీసీ గర్జన పేరుతో మరో డ్రామా
-జగన్ శవ రాజకీయాలపై ప్రజల్లో విసుగు
-స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి వైసీపీకి గుణపాఠం ఖాయం : మంత్రి సవిత
-గిద్దలూరులో ఇంటింటికీ తెలుగుదేశం
-ప్రభుత్వ పథకాలు, అభివృద్ధినిపై వివరించిన మంత్రి
-కూటమి పాలనపై ప్రజల్లో వస్తున్న స్పందనపై మంత్రి సవిత హర్షం

గిద్దలూరు/మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీపై ఆరోపణలు కాదు రుజువులు చూపించమంటే జగన్ ముఖం చాటేస్తున్నాడని, దమ్ముంటే చర్చకు రా అని సవాల్ చేస్తున్నా పారిపోతున్నాడని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. అయిదేళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ కు మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీని స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. బీసీ గర్జన అంటూ మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందని, జగన్ ను, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తు.చ.తప్పకుండా అమలు చేస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడు గుర్రాల్లో పరుగులు పెట్టిస్తోందని అన్నారు. గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు రాజానగర్ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డితో కలిసి మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అమరావతి రాజధాని, పోలవరం పనులు పూర్తి కావొస్తున్నాయన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలు అందజేయాలన్నదే సీఎంచంద్రబాబు లక్ష్యమన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంపు, అన్న క్యాంటీన్లు, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక, తల్లికి వందనం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం..ఇలా ఎన్నో పథకాలను కేవలం రెండేళ్ల కాలంలోనే అమలు చేశామన్నారు. త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు ఉచిత విద్యుత్ ఇప్పటికే అందిస్తున్నామని, వచ్చే నెల ఏడో తేదీ నుంచి నేతన్న సేవలో పథకం పేరుతో ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం ఇవ్వనున్నామని మంత్రి సవిత తెలిపారు.

నిరుద్యోగులకు జగన్ మోసం

అయిదేళ్లలో జగన్ ఒక్కసారి కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, నిరుద్యోగులను మోసగించారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పై సంతకం చేసి, 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. మెగా డీఎస్సీని అడ్డుకోడానికి జగన్ కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారన్నారు. ఆ అడ్డకుంలన్నీ అధిగమించి, మంత్రి నారా లోకేశ్ మెగా డీఎస్సీని ఎటువంటి అక్రమాలకు తావులేకుండా నిర్వహించారన్నారు. ఓర్వలేని తనంతో మెగా డీఎస్సీ నిర్వహపై జగన్ విషం కక్కుతున్నారన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా, అవినీతి జరిగిందంటూ జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోపణలు కాదు…రుజువులు చూపించు… చర్చకు రా…అంటే చేతకాత, జగన్ ముఖం చాటేసి పారిపోతున్నాడని మండిపడ్డారు. మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదని మంత్రి సవిత ఆగ్రహం వక్తంచేశారు.

బీసీ గర్జన పేరుతో వైసీపీ డ్రామా

అయిదేళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి సవిత మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించడమేకాకుండా, ఇదేంటని ప్రశ్నించి వారిని తీవ్ర వేధింపులకు గురిచేశారన్నారు. బీసీలపై తప్పుడు కేసులు పెట్టి వారిని అన్ని విధాలా భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అవన్నీ మర్చిపోయి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికి వైసీపీ మరోసారి బీసీ జపం చేస్తోందన్నారు. బీసీ గర్జన అంటూ కొత్త డ్రామాకు తెరతీసిందన్నారు. బీసీలెవరూ జగన్ ను గాని, వైసీపీని గాని పట్టించుకోరన్నారు. జగన్ ఎన్ని నాటాకాలు ఆడినా బీసీలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కూటమి ప్రభుత్వానికి బీసీలు దన్నుగా ఉన్నారని మంత్రి సవిత తెలిపారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పనితీరుపై మంత్రి ప్రశంసలు కురిపించారు. నియోజక వర్గంలో అభివృద్ధికి రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే గెలుపు

కులాలు, మతాలు మధ్య చిచ్చు పెడుతూ, శవ రాజకీయాలకు పాల్పడే వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి సవిత తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి వైసీపీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి కూటమి అభ్యర్థులకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా, సమన్వయం చేసుకుంటూ విజయానికి కృషి చేయాలని మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు.

యోగ, క్షేమాలు తెలుసుకుంటూ… పథకాలు వివరిస్తూ…

అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి మంత్రి సవిత గిద్దలూరు మున్సిపల్ పరిధిలోని రెండో వార్డు రాజానగర్ లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆప్యాయంగాపలుకరిస్తూ, కుటుంబ యోగా, క్షేమాలు గురించి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు గురించి వివరించారు. పెన్షన్లు, తల్లికివందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అందాయా… ఉచిత గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారా…ఫ్రీ బస్ సౌకర్యం వినియోగించుకున్నారా..? అని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, రాజధాని అమరావతి, పోలవరం పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అబ్జర్వర్ దశరథ ఆచారి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *