డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ పోరాటం… : వెలంపల్లి

-ఆగస్టు 2న పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్‌లో సమావేశం
-ఆగస్టు 6 నుండి 9 వరకు రిలే నిరాహార దీక్షలు
-ఆగస్టు 10న భారీ ప్రదర్శన
-విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయండి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
​డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరిస్తున్నట్లు ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.ఈ ఉద్యమ కార్యాచరణను వివరించేందుకు స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,డివిజన్ పరిశీలకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ నెల 2 తేదీన పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే సమావేశాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు,నిరుద్యోగులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.డీఎస్సీ అక్రమాలపై అభ్యర్థులకు,యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు,అలాగే 10వ తేదీన నిర్వహించే భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు.నియోజకవర్గంలోని విద్యార్థులను,యువకులను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని డివిజన్ పరిశీలకులు,స్థానిక నాయకులకు సూచించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని,అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు ఎండి రుహుళ్ల, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ బండి పుణ్యశీల, మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు యరడ్ల ఆంజనేయ రెడ్డి, ఎండి ఇర్ఫాన్, బాపతి కోటిరెడ్డి, శిరంశెట్టి పూర్ణ, యలకల చలపతిరావు, షేక్ హయత్, మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, మాజీ చైర్మన్ గౌస్ మొహిద్దీన్, రాష్ట్ర నాయకులు,డివిజన్ అధ్యక్షులు,డివిజన్ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *