Breaking News

ప్రజల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అధిక ప్రాదాన్యతనిస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నుండి అందే పిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, నిర్దేశిత గడువులోపు పిర్యాదులను పరిష్కరించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగర పాలక సంస్థ విభాగాదిపతులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజల నుండి అందుతున్న పిర్యాదుల పరిష్కారం పై మరియు కోర్ట్ కేసులకు సంబంధించి వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం జరిగింది.
సదరు సమావేశం కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాదాన్యతనిస్తున్నారని, ప్రజల నుండి అందే పిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులను ఆదేశించారు. పిర్యాదులను పరిష్కరించే ముందు తరువాత ఫోటోలను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలన్నారు. పిర్యాదులను నిర్దేశిత గడువు పూర్తైనప్పటికి పరిష్కరించని అధికారులు మరియు సిబ్బంది పై చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. పిర్యాదుల పరిష్కారంలో సమస్యలేమైనా ఉంటె ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర పాలక సంస్థ కాల్ సెంటర్ కు వస్తున్న పిర్యాదుల పరిష్కారంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రజల వద్ద నుండి ఎక్కువగా ఏ సమస్య పై పిర్యాదులు అందుతున్నది గుర్తించి, వాటిని పరిష్కరించి, మరలా అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా త్రాగు నీరు, యు.జి.డి, స్ట్రీట్ లైటింగ్ కి సంబంధించి అందే పిర్యాదులను వెంటనే పరిష్కరించలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్నా కాంటీన్ ల వద్ద పారిశుధ్యం సరిగా ఉండుట లేదని పిర్యాదులు అందుతున్నాయని, కాంటీన్ ల వద్ద పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వచ్చే సోమవారం నాటికి ప్రజల నుండి అందిన అన్ని పిర్యాదులు పూర్తి స్తాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విభాగాల వారీగా కోర్టు కేసుల వివరాలను సమీక్షించి, పట్టణ ప్రణాళిక, రెవిన్యూ విభాగాలకు సంబంధించి ఎక్కువగా కేసులు ఉండుట గమనించి అసహనం వ్యక్తం చేసి, నగర పాలక సంస్థ పై ఫైల్ అయిన కేసులకు సంబంధించి వెంటనే పారావైజ్ రిమార్క్స్ మరియు కౌంటర్ ఫైల్స్ ను దాఖలు చేయాలని విభాగాదిపతులను ఆదేశించారు.
సమావేశం నందు సియంఓహెచ్ డాక్టర్ శాంతి కళ, సిటీ ప్లానర్ రాంబాబు, యస్ఈ సుందర్రామి రెడ్డి, డి.సి.పి సూరజ్ కుమార్, యంహెచ్ఓ డాక్టర్ సురేష్, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *